TCS Employee Crisis: ఐటీ సంక్షోభం టాప్ కంపెనీల ఉద్యోగులను రోడ్డున పడేస్తోంది. రప్పా.. రఫ్పా ఉద్యోగాల్లో కోత విధిస్తుండడంతో ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో తెలియని పరిస్థితి. దీంతో ఏరోజుకారోజు ఉద్యోగులు హమ్మయ్య ఈ రోజు నా ఉద్యోగం పోలేదు అనుకునే పరిస్థితి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, టీసీఎస్, తదితర టాప్ సంస్థలు కూడా ఉద్యోగుల తొలగింపనకు ఏమాత్రం వెనుకాడడం లేదు. తాజాగా భారత ప్రముక ఐటీ సంస్థ టీసీఎస్ 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగాలకు భద్రత లేదన్న విషయం ఐటీ ప్రొఫెషనల్స్‌కు అర్థమైంది. తాజాగా పుణెలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కార్యాలయం ఎదుట సౌరభ్ మోరె అనే ఉద్యోగి ఫుట్పాత్‌పై నిద్రించడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొన్ని నెలలుగా జీతం చెల్లించకపోవడం, ఉద్యోగ గుర్తింపు కార్డు (ఐడీ) యాక్టివ్ కాకపోవడం వంటి సమస్యలతో ఈ నిరసనకు దిగినట్లు సౌరభ్ తెలిపాడు. తన గోడును కాగితంపై రాసి ప్రదర్శించడం ద్వారా కంపెనీ నిర్వహణపై తీవ్ర విమర్శలు తెచ్చింది. ఈ ఘటన టీసీఎస్‌లో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే విధానంపై ప్రశ్నలను లేవనెత్తింది.
Also Read: చైనాకు చెక్ పెట్టే ఇండయాలోని లోహం ఇదే..
ఉద్యోగి నిరసనపై టీసీఎస్ స్పందన..
టీసీఎస్ ఈ వివాదంపై స్పందిస్తూ, సౌరభ్ మోరె చెప్పాపెట్టకుండా విధులకు గైర్హాజరయ్యాడని, కంపెనీ నిబంధనల ప్రకారం అతడి జీతాన్ని నిలిపివేసినట్లు తెలిపింది. అయితే, సౌరభ్ తిరిగి కార్యాలయంలో రిపోర్ట్ చేసి, విధుల్లోకి తీసుకోవాలని అభ్యర్థించినట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం అతడికి వసతి కల్పించడంతో పాటు, సమస్య పరిష్కారానికి మద్దతు అందిస్తున్నట్లు టీసీఎస్ పేర్కొంది. ఈ స్పందన కంపెనీ యొక్క సమస్యాత్మక పరిస్థితులను నిర్వహించే ప్రయత్నాన్ని సూచిస్తుంది, కానీ ఉద్యోగులతో సంబంధాల నిర్వహణలో సమర్థవంతమైన కమ్యూనికేషన్ లోపాలను కూడా బహిర్గతం చేస్తుంది.
ఉద్యోగ కోతలు..
టీసీఎస్ ఇటీవల 2025–26 ఆర్థిక సంవత్సరంలో 12,261 మంది ఉద్యోగులను తొలగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సీఈఓ కె.కృతివాసన్ ప్రకటించారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు మరియు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతలో మార్పులు ఈ నిర్ణయానికి కారణమని తెలిపారు. ఈ ప్రకటన కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ దృష్టిని ఆకర్షించింది, పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ఉద్యోగ కోతలు టీసీఎస్‌లో ఉద్యోగ భద్రతపై ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి, ముఖ్యంగా ఐటీ రంగంలో ఏఐ సాంకేతికతలు ఉద్యోగాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయనే చర్చను తీవ్రతరం చేస్తున్నాయి.
ఆఫర్ లెటర్ వివాదం..
మరోవైపు టీసీఎస్ రెండు నుంచి ఎనిమిది సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులకు ఉద్యోగ ఆఫర్‌లు జారీ చేసి, జాయినింగ్ తేదీలను ప్రకటించకపోవడంపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మండవీయాకు ఫిర్యాదులు అందాయి. దాదాపు 600 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తామని టీసీఎస్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వివాదం కంపెనీ యొక్క నియామక విధానాలపై అనుమానాలను రేకెత్తిస్తోంది.
Also Read: మొన్న ‘ఎయిర్ ఇండియా’.. ఇప్పుడు TCS.. అసలు TATA కంపెనీలకి ఏమవుతుంది?
సౌరభ్ మోరె నిరసన, ఉద్యోగ కోతలు, ఆఫర్ లెటర్ వివాదాలు టీసీఎస్‌ను విమర్శల కేంద్రంగా నిలిపాయి. ఈ ఘటనలు కంపెనీ యొక్క ఉద్యోగుల సంక్షేమ విధానాలు, నియామక ప్రక్రియలలో లోపాలను బహిర్గతం చేస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా ఈ సమస్యలు వేగంగా వ్యాప్తి చెందడం వల్ల కంపెనీ బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం ఏర్పడింది.