గవర్నర్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు..

ఉస్మానియా యూవవర్సిటీ(ఓయూ) భూముల అన్యాక్రాంతంపై కాంగ్రెస్ నేతలు సోమవారం తెలంగాణ గవర్నర్ తమిళ సై దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ పెద్దల అండతోనే ఓయూ భూములు ఆక్రమణకు గురవుతోందని కాంగ్రెస్ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తుందని కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, వీహెచ్ హన్మంతరావులు ఆరోపించారు. యూనివర్సిటీలకు నిధులు ఇవ్వకుండా ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతుందన్నారు. పేదలకు ఉన్నత విద్యను అందించే […]

Written By: Neelambaram, Updated On : June 1, 2020 2:48 pm
Follow us on

ఉస్మానియా యూవవర్సిటీ(ఓయూ) భూముల అన్యాక్రాంతంపై కాంగ్రెస్ నేతలు సోమవారం తెలంగాణ గవర్నర్ తమిళ సై దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ పెద్దల అండతోనే ఓయూ భూములు ఆక్రమణకు గురవుతోందని కాంగ్రెస్ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తుందని కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, వీహెచ్ హన్మంతరావులు ఆరోపించారు. యూనివర్సిటీలకు నిధులు ఇవ్వకుండా ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతుందన్నారు. పేదలకు ఉన్నత విద్యను అందించే యూనివర్సీటీలను నిధులు విడుదల చేయకపోవడం అన్యాయమని దీనిని ఖండిస్తున్నట్లు తెలిపారు.

ఓయూ భూములను ప్రభుత్వ పెద్దల అండదండలతో కొందరు అన్యాక్రాంతం చేస్తున్నారని తెలిపారు. యూనివర్సిటీ భూములను కాపాడాల్సిన ప్రభుత్వం ఈ విషయంలో స్పందించకపోవడంలో అంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. ఓయూలో కేంద్ర సర్వే డిపార్ట్‌మెంట్‌తో భూములను సర్వే చేయించాలని గవర్నర్ ను కోరినట్లు తెలిపారు. అన్యాక్రాంతమైన భూములను కాపాడాలని విన్నవించారు. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.

అదేవిధంగా గిరిజనుల రిజర్వేషన్లో విషయంలో టీఆర్ఎస్ సర్కార్ మోసం చేస్తుందని కాంగ్రెస్ నేత రాములు నాయక్ ఆరోపించారు. తెలంగాణ ఏర్పడి ఆరేళ్లు గడిస్తున్నా గిరిజనులకు రిజర్వేషన్లను కేసీఆర్ పెంచలేదన్నారు. గిరిజనుల రిజర్వేషన్ల విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల హక్కులను కాలారాస్తుందని ఆయన అన్నారు. గవర్నర్ ను కలిసిన వారిలో టీపీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు జగ్గారెడ్డి, తదితర కాంగ్రెస్ నేతలు ఉన్నారు.