https://oktelugu.com/

కోవిద్19 కట్టడికి టాటా ట్రస్ట్ భారీ విరాళం!

దేశంలో కరోనా నియంత్రణ కోసం పలువురు రాజకీయ, పారిశ్రామిక, సినీ రంగ ప్రముఖులు సహాయ నిధులకు తమవంతుగా ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు. తాజాగా వ్యాపార వేత్త రతన్ టాటా ముందుకు వచ్చారు. కరొనాను ఎదుర్కొనడానికి తన వంతు సహాయంగా రూ.500 కోట్ల రూపాయలు సహాయం అందించారు. ప్రధాన మంత్రి సహాయ నిధికి ఆయన ఈ మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్బంగా రతన్ టాటా ట్వీట్ చేశారు. అందులో కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన అత్యవసర […]

Written By: , Updated On : March 28, 2020 / 07:12 PM IST
Follow us on

దేశంలో కరోనా నియంత్రణ కోసం పలువురు రాజకీయ, పారిశ్రామిక, సినీ రంగ ప్రముఖులు సహాయ నిధులకు తమవంతుగా ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు. తాజాగా వ్యాపార వేత్త రతన్ టాటా ముందుకు వచ్చారు. కరొనాను ఎదుర్కొనడానికి తన వంతు సహాయంగా రూ.500 కోట్ల రూపాయలు సహాయం అందించారు. ప్రధాన మంత్రి సహాయ నిధికి ఆయన ఈ మొత్తాన్ని అందజేశారు.

ఈ సందర్బంగా రతన్ టాటా ట్వీట్ చేశారు. అందులో కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన అత్యవసర వనరులను సమకూర్చుకోవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. గతంలో దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో మేము అండగా నిలిచాం. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ గతంలో కన్నా ఎక్కువగా మద్దతుగా నిలవాల్సి ఉందని రతన్‌ టాటా ట్వీట్‌ చేశారు. ఈ నిధులను వైద్యులకు అవసరమైన పీపీఈలు, కరోనా కేసులు పెరిగితే చికిత్స కోసం వినియోగించే శ్వాససంబంధ పరికరాలు, టెస్టింగ్‌ కిట్ల కొనుగోలు, హెల్త్‌ వర్కర్ల శిక్షణ కోసం ఉపయోగిస్తామన్నారు.

ఇండియాలో ఇప్పటి వరకు 933 కరోనా కేసులు నమోదయ్యాయి. 20 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఇండియా రెండో స్టేజ్ లో ఉన్నది. మూడో స్టేజ్ లోకి వెళ్ళకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు పోరాటం చేస్తున్నాయి. ఎలాగైనా సరే వైరస్ కు చెక్ పెట్టె దిశగా ప్రభుత్వాలు కలిసికట్టుగా పోరాటం చేస్తున్నాయి. భారత ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ కార్యక్రమం విజయవంతం అయ్యే దిశగా అడుగులు వేస్తుండటం విశేషం.