కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి-152వ సినిమా తెరకెక్కుతుంది. ‘ఓ పిట్టకథ’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చిరంజీవి ఈ మూవీ టైటిల్ ‘ఆచార్య’గా ప్రకటించిన సంగతి తెల్సిందే. కరోనా ఎఫెక్ట్ తో ‘ఆచార్య’ మూవీ షూటింగ్ వాయిదా పడింది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి పక్కన జబర్దస్ట్ బ్యూటీ, రంగమ్మత్త అనసూయ ఓ స్పెషల్ సాంగ్ చేయనుందని ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తుంది. మెగా బ్రదర్ నాగబాబు రికమెండేషన్ తోనే అనసూయకు మెగా హీరోల పక్కన ఛాన్సులు దక్కుతున్నాయని ప్రచారం జరుగుతుంది.
‘ఆచార్య’ మూవీలో చిరంజీవి ద్విపాత్రభినయం చేస్తున్నాడు. అదేవిధంగా రాంచరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. పాత మెగాస్టార్ ను పూర్తిగా దింపేందుకు కొరటాల శివ ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా చిరంజీవితో మాస్ సాంగ్స్, అదిరిపోయే ఫైట్స్ సినిమాలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. మెగా అభిమానులకు కావాల్సిన అన్నిహంగులు ‘ఆచార్య’ ఉంటాయని కొరటాల శివ తెలిపారు. ఇందుకు తగ్గట్టుగానే చిరంజీవి-రెజీనా మధ్య ఓ స్పెషల్ ఐటమ్స్ ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో తెరకెక్కించారు. ఈ పాటలో చిరు-రెజీనాల స్టెప్స్ అదిరిపోనున్నట్లు సమాచారం. తాజాగా మరో స్పెషల్ సాంగ్ ఈ మూవీలో ఉండనుందని ప్రచారం జరుగుతుంది. రంగమ్మత్త అనసూయ ఈ స్పెషల్ సాంగ్లో మెగాస్టార్ తో ఆడిపాడనుందని తెలుస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.
‘ఆచార్య’ మూవీలో చిరంజీవికి జోడీగా తొలుత త్రిషను ఎంపిక చేశారు. అయితే చివరి నిమిషంలో త్రిష ఈ మూవీని నుంచి తప్పుకోవడంతో ఈ అవకాశం చందమామ కాజల్ అగర్వాల్ కు దక్కింది. చిరు రీఎంట్రీ మూవీ ‘ఖైదీ-150’లో కాజల్ నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. తాజాగా మరోసారి చిరంజీవితో రోమాన్స్ చేసేందుకు చందమామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక రాంచరణ్ సరసన నటించే హీరోయిన్ల విషయంలో కొంత క్లారిటీ రావాల్సింది. బాలీవుడ్ నటి కియారా అడ్వాణీ, రష్మిక మందన్న పేర్లు విన్పిస్తున్నాయి. ఈ మూవీని రాంచరణ్ మ్యాట్నీ ఎంటటైన్మెంట్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. మ్యూజికల్ బ్రహ్మ మణిశర్మ అదిరిపోయే సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.