Chandrababu – VijayaSai : పిక్ ఆఫ్ ది డే: బద్ధ విరోధులు విజయసాయి-చంద్రబాబును కలిపిన ‘తారకరత్న’

Chandrababu – VijayaSai : రాజకీయాలను రాజకీయాలాగే చూడాలి. వ్యక్తిగత సంబంధాల్లోకి రాజకీయాలను చొప్పించకూడదు. కానీ ఏపీలో అలా కాదు కదా! కులం, బాడీ షేమింగ్ అక్కడ పరిపాటి. రాజకీయ పంకిలంలోకి మహిళలను కూడా తీసుకొస్తారు.. మహిళలు అని చూడకుండా జైల్లో వేస్తారు. ఇక దూషణలకు అయితే అంతు పొంతు ఉండదు.. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. ఇక ఏ వర్గం వారికి ఆ వర్గం మీడియా ఉంది. నచ్చినవాన్ని నెత్తిన పెట్టుకోవడం, నచ్చనివాన్ని రాళ్లు తీసుకొని […]

Written By: NARESH, Updated On : February 19, 2023 8:09 pm
Follow us on

Chandrababu – VijayaSai : రాజకీయాలను రాజకీయాలాగే చూడాలి. వ్యక్తిగత సంబంధాల్లోకి రాజకీయాలను చొప్పించకూడదు. కానీ ఏపీలో అలా కాదు కదా! కులం, బాడీ షేమింగ్ అక్కడ పరిపాటి. రాజకీయ పంకిలంలోకి మహిళలను కూడా తీసుకొస్తారు.. మహిళలు అని చూడకుండా జైల్లో వేస్తారు. ఇక దూషణలకు అయితే అంతు పొంతు ఉండదు.. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. ఇక ఏ వర్గం వారికి ఆ వర్గం మీడియా ఉంది. నచ్చినవాన్ని నెత్తిన పెట్టుకోవడం, నచ్చనివాన్ని రాళ్లు తీసుకొని కొట్టడం అక్కడ పరిపాటిగా మారింది. ఇలాంటి స్థితిలో రెండు వర్గాల నాయకులు కలిసిపోయారు. పక్కపక్కన కూర్చొని మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుకున్నారు అనేది పక్కన పెడితే చూసి ఎందుకు ఈ సీన్ బాగుంది. ఎంతో నచ్చింది కూడా.

దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అని రాశాడు గురజాడ అప్పారావు.. కానీ దురదృష్టవశాత్తు ఆ మనుషులు పదవుల కోసం కొట్లాడుకుంటున్నారు. రాజకీయాల పేరుతో రచ్చ రచ్చ చేస్తున్నారు. రేపటి తరం రాజకీయాల వైపు చూసే పరిస్థితి లేకుండా చేస్తున్నారు.. పై అవ లక్షణాలన్నీ ఏపీలో ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి. కేసులు, జైల్లో పెట్టుకోవడాలు అక్కడ కామన్ అయిపోయాయి. అయితే ఈ రాష్ట్రానికి చెందిన టిడిపి నాయకుడు, సినీ నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై తీవ్ర అస్వస్థత తో కన్నుమూశాడు.. ఈ సందర్భంగా మృతదేహాన్ని చూసేందుకు టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బెంగళూరు వెళ్లారు. పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు.

విజయసాయిరెడ్డి మరదలు కూతురు అలేఖ్య రెడ్డి. ఈమె తారకరత్న సతీమణి. గతంలో వీరి ప్రేమ వివాహాన్ని ఇరువైపు కుటుంబాలు ఆమోదించనప్పుడు.. వారికి విజయ సాయి రెడ్డి అండగా నిలిచారు. పలు సందర్భాల్లో తన తోడ్పాటు అందించారు.. ఇదే విషయాన్ని అలేఖ్య రెడ్డి పలు సందర్భాల్లో చెప్పారు.. తారకరత్న కూడా విజయసాయి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు తారకరత్న ఆసుపత్రిలో ఉన్నప్పుడు పరామర్శించేందుకు విజయసాయిరెడ్డి వెళ్లారు. అక్కడ ఉన్న బాలకృష్ణతో కూడా మాట్లాడారు. ఆయనకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇక తారకరత్న పార్థివదేహాన్ని చూసేందుకు బెంగళూరు వెళ్లిన క్రమంలో చంద్రబాబుతో విజయసాయిరెడ్డి మాట్లాడారు. తారకరత్న మరణం పై విచారం వ్యక్తం చేశారు. చంద్రబాబు కూడా విజయసాయిరెడ్డిని అనునయించారు. ప్రస్తుతం వీరిద్దరూ మాట్లాడుకుంటున్న వీడియో, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.