Homeక్రీడలుIND vs AUS : ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ లో మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అదే

IND vs AUS : ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ లో మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అదే

IND vs AUS  : ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా జోరు కొనసాగిస్తోంది. వరుసగా రెండో టెస్టులోనూ విజయం సాధించి 2_0 ఆధిక్యం లోకి దూసుకెళ్లింది.. ఢిల్లీ వేదికగా ఆదివారం జరిగిన రెండో టెస్టులో ఇండియా సమిష్టి గారి నుంచి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.. 115 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన టీమిండియా 26.4 లోనే నాలుగు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.

రాహుల్ 1, శ్రేయస్ అయ్యర్ 12 విఫలమైనప్పటికీ… రోహిత్ శర్మ (20 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్స్ లతో) 31, పూజార (74 బంతుల్లో నాలుగు ఫోర్ లతో) 31 రాణించారు. విరాట్ కోహ్లీ (31 బంతుల్లో మూడుఫోర్లు) 20, కేఎస్ భరత్ (22 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్) 23 (నాట్ అవుట్ ) మెరుపులు మెరిపించారు.. ఆస్ట్రేలియా బౌలర్లలో లయాన్ రెండు వికెట్లు తీశాడు. టాడ్ మర్ఫీ ఒక వికెట్ తీశాడు. లేని పరుగుకు ప్రయత్నించి రోహిత్ శర్మ రన్ అవుట్ అయ్యాడు.

అంతకుముందు 61/1 పవర్ నైట్ స్కోర్ తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 31.1 ఓవర్లలో 113 పరుగులకు కుప్పకూలింది. రవీంద్ర జడేజా (7/42) కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు. జడేజా కు అశ్విన్ (3/59) తోడు కావడంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ తొలి సెషన్ లోనే ముగిసింది..హెడ్(45), లబు షేన్(35) రెండు అంకెల స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.. గింగిరాలు తిరుగుతున్న మైదానంపై ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఆటాకింగ్ చేయబోయి భారీ మూల్యం చెల్లించుకున్నారు. ముఖ్యంగా స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ఆడబోయి వికెట్లు పారేసుకున్నారు. కొంచెం కుదురుగా నిలబడి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది.

అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులు చేసిన ఆస్ట్రేలియా.. ఇండియాను 262 పరుగులకు అలౌట్ చేసింది. అక్షర్ పటేల్ (74) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడంతో టీమిండియా గట్టెక్కింది. 139 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో…అక్షర్ సాధారణ బ్యాటింగ్ తో ఇండియాను నిలబెట్టాడు.. అశ్విన్ (37) తో కలిసి 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక ఇన్నింగ్స్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది.. రెండవ టెస్ట్ విజయంతో టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2_0 ఆధిక్యంలో నిలిచింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version