https://oktelugu.com/

‘ఇస్మార్ట్’ టిప్స్ చెబుతానంటున్న హీరోయిన్

లాక్డౌన్ కారణంగా షూటింగులు వాయిదా పడటంతో సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితయ్యారు. కలిసొచ్చిన సమయాన్ని సెలబ్రెటీలు ఫ్యామిలీతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు హీరోయిన్లు అయితే యోగా, ఫిటెనెస్, కుకింగ్, ఆన్ లైన్ కోర్సులు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. మరికొందరేమో హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ వేసవిని మరింత హీటెక్కిస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్లు ప్రత్యేక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అభిమానులతో నిత్యం టచ్లో ఉంటున్నారు. అయితే ఓ యంగ్ హీరోయిన్ మాత్రం తన అభిమానుల కోసం ఓ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 29, 2020 / 08:13 PM IST
    Follow us on


    లాక్డౌన్ కారణంగా షూటింగులు వాయిదా పడటంతో సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితయ్యారు. కలిసొచ్చిన సమయాన్ని సెలబ్రెటీలు ఫ్యామిలీతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు హీరోయిన్లు అయితే యోగా, ఫిటెనెస్, కుకింగ్, ఆన్ లైన్ కోర్సులు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. మరికొందరేమో హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ వేసవిని మరింత హీటెక్కిస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్లు ప్రత్యేక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అభిమానులతో నిత్యం టచ్లో ఉంటున్నారు. అయితే ఓ యంగ్ హీరోయిన్ మాత్రం తన అభిమానుల కోసం ఓ యూబ్యూట్ ఛానల్ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. అందుకు గల కారణాలను కూడా వివరించింది.

    పూరి జగన్మాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ మూవీలో రామ్ సరసన నభా నటేష్, నిధి అగర్వాల్ నటించారు. షూటింగులు వాయిదాపడటంతో ఇంటికే పరిమితమైన నభానటేష్ తన అందాన్ని కాపాడుకునేందుకు ఇంటి చిట్కాలను పాటిస్తుంది. జుట్టు వత్తుగా పెరగడానికి, ముఖం మరింత ఆకర్షణీయంగా మారడానికి, కాళ్ల పగుళ్లు, కళ్లకింద నలుపు పోవడానికి, బరువు పెరగకుండా ఉండడానికి లాకౌన్డో చాలా చిట్కాలను పాటించింది. ఇవన్నీ తనకు మంచి రిజల్ట్ ఇవ్వడంతో అభిమానుల నుంచి ఆమె పెద్ద సంఖ్యలో రిక్వెస్టు వచ్చాయని తెలిపింది.

    సోషల్ మీడియా ద్వారా తమకు కూడా ఆ చిట్కాలు చెప్పమని చాలామంది అమ్మాయిలు నభాను అడిగారని చెబుతోంది. దీంతో వారందరికీ కోసం త్వరలోనే ఓ యూట్యూబ్ ప్రారంభించనున్నట్లు చెబుతోంది. అందులో హెల్త్ కు సంబంధించిన కొన్ని వీడియోలు పెడతానని నభానటేష్ చెబుతోంది. అది కూడా ఫుల్ టైమ్ కాదని.. పార్ట్ టైమ్ గా కొన్నాళ్లు చేస్తానని నభానటేష్ పేర్కొంది. ఈ ఇస్మార్ట్ బ్యూటీ టిప్స్ కోసం అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు.