Homeజాతీయ వార్తలుTamil Nadu temple revenue controversy: అక్షరాల 60 వేల కోట్లు.. అప్పనంగా పంచుకుని తిన్నారు

Tamil Nadu temple revenue controversy: అక్షరాల 60 వేల కోట్లు.. అప్పనంగా పంచుకుని తిన్నారు

Tamil Nadu temple revenue controversy: శీర్షిక చదువుతుంటే రక్తం ఉడికిపోతుంది కదూ.. 60 వేల కోట్లను పంచుకొని తిన్న వెధవలను బహిరంగంగా శిక్షించాలని అనిపిస్తుంది కదూ. నిజమే వాళ్ళు చేసిన దారుణానికి.. ఇంతకాలం పాల్పడిన అన్యాయానికి కచ్చితంగా శిక్షించాల్సిందే. కానీ ఆ పని ఎవరు చేస్తారు.. ఆ పని చేసే దమ్ము ఎవరికి ఉంది..

తమిళనాడులో మన దేశంలోనే ఎక్కువగా ఆలయాలు ఉంటాయి. దీనిని టెంపుల్ స్టేట్ అని పిలుస్తుంటారు. రామేశ్వరాలయం నుంచి మొదలుపెడితే మీనాక్షి వరకు విశిష్టమైన ఆలయాలు తమిళనాడులో ఉంటాయి. ఇక్కడ ఆలయాలు వందల ఎకరాలలో ఉంటాయి. పైగా ఆలయ పరిసర ప్రాంతాల్లోనే వాణిజ్యసముదాయాలు.. ఇతర నిర్మాణాలు ఏర్పాటు చేశారు.. వీటిని అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చిన సొమ్మును ప్రభుత్వం తీసుకుంటుంది. తమిళనాడులో ఆలయాల ఆస్తుల మీద ప్రభుత్వానికి మాత్రమే హక్కు ఉంటుంది.

ఇంతటి స్థాయిలో ఆస్తులు ఉన్నప్పటికీ ఆశించిన విధంగా ఆదాయం రావడం లేదు. ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అధికారంలో ఉన్న పార్టీ నాయకులు అడ్డగోలుగా దోచుకోవడం మొదలుపెట్టారు. తమకు అనుకూలమైన వ్యక్తులకు ఆ వాణిజ్య సముదాయాలను అద్దెకు ఇవ్వడం ప్రారంభించారు. దేవస్థానాలకు కాకుండా .. తమ సొంత జేబుల్లోకి ఆ ఆదాయాన్ని మళ్ళించుకున్నారు. ఫలితంగా గడిచిన కొన్ని సంవత్సరాలుగా దాదాపు 60 వేల కోట్ల ఆదాయం పక్కదారి పట్టింది. వాస్తవానికి వేలకోట్ల ఆదాయం వందల కోట్లకు పడిపోయింది. ప్రభుత్వ పెద్దలకు ఇందులో పాత్ర ఉండడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు.

ఇటీవల తమిళనాడులో ఒక వ్యక్తి ఈ వ్యవహారాన్ని సమాచార హక్కు ద్వారా బయటికి తీసుకొచ్చాడు. అంతేకాదు కోర్టు దాక కూడా వెళ్ళాడు. దీనిపై కేసు విచారణలో ఉంది. ఒకవేళ కేసు విచారణకు వస్తే తమిళనాడు ప్రభుత్వం కచ్చితంగా దోషిగా నిలబడుతుంది. ఒకవేళ కోర్టు ఆ డబ్బు మొత్తం చెల్లించాలని చెప్పినప్పటికీ ఎవరు చెల్లిస్తారు.. ఆ డబ్బు చెల్లించడానికి ఎవరు ముందుకు వస్తారు.. అన్నాడిఎంకె.. డీఎంకే ద్రావిడ వాదాన్ని తలకెత్తుకున్నాయి. కానీ ఓ వర్గాలను మెప్పించడానికి హిందువులను తొక్కేశాయి. అంతేకాదు, దేవాలయ ఆస్తులను కూడా ఆక్రమించాయి. ఓ నివేదిక ప్రకారం తమిళనాడులో చాలావరకు ఆలయాలలో ఆస్తులు అన్యాక్రాంతం అయిపోయాయి. ఇందులో డీఎంకే.. అన్న డీఎంకే పార్టీ నేతల హస్తముంది ఇప్పుడు టీవీకి నేతలు కూడా అదే పని చేస్తారు. అలాంటప్పుడు ఈ దుర్మార్గుల భరతాన్ని ఎవరు బయటపెడతారు.. సాక్షాత్తు ఆ దేవుడే దిగి వస్తే తప్ప ఈ ఆక్రమాలకు పాల్పడిన దుర్మార్గుల అసలు రంగు బయటపడదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular