Homeజాతీయ వార్తలుHero Vijay Meet KCR: కేసీఆర్ ను స్టార్ హీరో కలవడం వెనుక పెద్ద ప్లానే...

Hero Vijay Meet KCR: కేసీఆర్ ను స్టార్ హీరో కలవడం వెనుక పెద్ద ప్లానే ఉందే!

Hero Vijay Meet KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తమిళ హీరో విజయ్ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన వెంట దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఉన్నారు. ఓ సినిమా నిర్మాణంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన విజయ్ మర్యాదపూర్వకంగా సీఎంను కలిసినట్లు తెలుస్తున్నా ఇందులో ఏదో గుట్టు దాగుందనే వార్త వైరల్ అవుతోంది. దీంతో అసలు రాష్ర్టంలో ఏం జరుగుతోంది. రాజకీయాలు ఎటు వైపు వెళ్తున్నాయి. జరుగుతున్న తంతు చూస్తుంటే రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు.

Hero Vijay Meet KCR
Vijay, KCR

హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం ను కలిసిన విజయ్ ని కేసీఆర్ శాలువాతో సన్మానం చేశారు. తీయబోయే సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నారు. విజయ్ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఏకకాలంలో నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం కావడంతో కేసీఆర్ ను కలిసినట్లు వస్తున్న వార్తలను ఖండిస్తున్నారు. వీరి కలయికకు ఇంకా ఏదో ఉందనే కోణంలో ఆరా తీస్తున్నారు.

Also Read: Sarkaru Vaari Paata Collections: ‘సర్కారు’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. రేట్లు తగ్గాయి, అయినా జనం లేరు

విజయ్ కూడా తమిళనాడులో కొత్తగా పార్టీ పెడతారనే వాదన వస్తోంది. ఆయన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను కలిసేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా పీకే హైదరాబాద్ లో ఉండటంతో విజయ్ అతడిని కలిసేందుకు వచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగానే సీఎంను ముందుగా కలిసి తరువాత పీకేతో దాదాపు రెండు గంటలు భేటీ అయినట్లు చెబుతున్నారు.

Hero Vijay Meet KCR
Vijay, KCR

గత ఎన్నికల్లోనే విజయ్ రాజకీయ అరంగేట్రం చేస్తారని భావించినా అప్పుడు ఆయన ముందుకు రాలేదు. జయలలిత మరణం తరువాత విజయ్ రాజకీయాల్లోకి వస్తారని ఆశించినా అది జరగలేదు. ఆయన త్వరలోనే పార్టీ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే ఏం చేయాలనే దానిపై చర్చించినట్లు చెబుతున్నారు. పీకే సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకే ప్రగతిభవన్ లో పీకేను కలిసినట్లు సమాచారం.

మొత్తానికి విజయ్ కేసీఆర్ ల కలయిక కొత్త చర్చలకు దారి తీస్తోంది. ప్రగతి భవన్ లో వీరి కలయికపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారనే వాదనలు కూడా వస్తున్నాయి. కానీ భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో తెలియడం లేదు. ఈ వ్యవహారం ఇంకా ఎందాకా వెళ్తుందో చెప్పడం కష్టమే.

Also Read:Gannavaram Constituency: సీఎంవోకు గన్నవరం పంచాయతీ.. ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్న వల్లభనేని వంశీ

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular