Suma Kanakala: యాంకర్ సుమ తాజాగా తన స్నేహితురాలు సింగర్ సునీతతో కలిసి ఒక ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. సునీత సుమను ప్రశ్నిస్తూ.. ‘నీకు ఒకేసారి పవన్ కళ్యాణ్ సినిమాలో.. అలాగే మీ ఆయన రాజీవ్ కనకాల సినిమాలో నటించే ఛాన్స్ వస్తే.. నువ్వు ఎవరి సినిమాలో నటిస్తావ్ ?’ అంటూ ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు సుమ మాట్లాడుతూ.. ‘నువ్వు చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్ వేశావు. రాజా నీ నిజ జీవితంలో నేనే నీ హీరోయిన్.. కనుక ఈసారికి పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాను అంటాను’ అంటూ సుమ తెలివిగా సమాధానం చెప్పింది.

ఇక యాంకర్ సుమ – రాజీవ్ కనకాల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉంటారు. కానీ, పాతికేళ్ల వీరి వివాహబంధంలో పొరపాచ్చాలు వచ్చాయని.. దాంతో ఇద్దరు విడిగా ఉంటున్నారని చాలా రోజుల నుండి చాలా రూమర్స్ వచ్చాయి. ఓ దశలో విడాకులు కూడా తీసుకోబోతున్నారని అన్నారు.
Also Read: Sarkaru Vaari Paata Collections: ‘సర్కారు’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. రేట్లు తగ్గాయి, అయినా జనం లేరు
దానికి తగ్గట్టుగానే హైదరాబాద్ లోనే ఉంటూ కూడా ఇద్దరూ వేరువేరు ఇళ్లల్లో ఉన్నారు. భార్యాభర్తలు ఇలా వేరు వేరు ఇళ్ళల్లో ఉండటంతో ఈ రూమర్స్ మరింత బలంగా వ్యాపించాయి. అయితే తాజాగా రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో సుమకి దూరంగా ఉండటం గురించి క్లారిటీ ఇచ్చారు. బయట వచ్చిన రూమర్స్ బాధ కలిగించాయి. అయితే, నిజంగానే నేను సుమకి కొన్నిరోజులు దూరంగా ఉన్నాను.

కానీ సుమతో గొడవ వల్ల కాదు. మా అమ్మగారు చనిపోయిన తర్వాత నాన్నగారు (దేవదాస్ కనకాల) ఒక్కరే మణికొండలో ఉండేవారు. అప్పుడు మా నాన్నగారిని మేము ఉండే ఫ్లాట్ కు తీసుకువద్దాం అనుకున్నాం. అయితే, ఆయన ఆ ఇంట్లోనే ఉండాలని పట్టుబట్టారు. అలాగే ఆయన బుక్ లైబ్రరీ కూడా చాలా పెద్దది. దాంతో దాన్ని మా ఫ్లాట్ లోకి షిఫ్ట్ చేయడం కష్టమే.
ఈ కారణంగానే నేను మా నాన్నగారితో పాటు మణికొండ ఇంటిలో ఆయన చివరి వరకు ఆయనతోనే ఉండిపోయాను. అంతే కానీ, సుమతో విడిపోయి కాదు. ఆలాగే మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. మేము విడాకులు తీసుకుంటున్నాము అంటూ ఏవేవో వార్తలు వచ్చాయి. వాటిల్లో ఏమాత్రం నిజం లేదు. మేము చాల బాగున్నాం’ అంటూ రాజీవ్ చెప్పుకొచ్చాడు.
Also Read:Sudigali Sudheer Birthday: హ్యాపీ బర్త్ డే సుధీర్.. ఇలాగే దూసుకు వెళ్లిపో.. పెద్ద హీరోవైపో
Recommended Videos