Homeఅంతర్జాతీయంAfghan Workers: సెక్స్ వర్కర్లే టార్గెట్.. తాలిబన్ల రాక్షస పాలనకు ఇదే మెట్టు

Afghan Workers: సెక్స్ వర్కర్లే టార్గెట్.. తాలిబన్ల రాక్షస పాలనకు ఇదే మెట్టు

Taliban Compile Kill List Of Afghan Sex Workers

Afghan Workers: అఫ్గనిస్తాన్ లో తాలిబన్ల రాక్షస పాలన సాగుతోంది. ప్రజలను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయమని చెప్పిన తాలిబన్లు ప్రస్తుతం ఆ మాట నిలబెట్టుకోవడం లేదు. దేశ భద్రత, ప్రజల హక్కుల కోసం పాటుపడతామని చెబుతున్నా ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. మహిళల పట్ల అత్యంత దయనీయంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. సెక్స్ వర్కర్లను టార్గెట్ గా చేసుకుని వారిని హతమార్చేందుకు కుట్రలు పన్నుతున్నట్లు సమాచారం.

అంతర్జాతీయ మీడియా ది సన్ వెలువరించిన కథనం ప్రకారం అఫ్గనిస్తాన్ లో పడుపు వృత్తిలో ఉన్న వేశ్యలను గుర్తించి వారిని చంపేందుకు తాలిబన్ డెత్ స్క్వాడ్ ఓ జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరు దేశాన్ని జల్లెడ పట్టి వారిని పట్టుకుని బహిరంగ శిరచ్ఛేదనం చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. వారిపై మరణశిక్షకు ముందు సామూహిక లైంగికదాడి జరిపి రాళ్తతో కొట్టడం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం తాలిబన్ డెత్ స్క్వాడ్ పోర్న్ సైట్లలో సెక్స్ వర్కర్లను గుర్తించే పనిలో పడిపోయారు. జాబితా రెడీ అయ్యాక వారిని బలవంతంగా ఇళ్లలో నుంచి కిడ్నాప్ చేసి శిక్షించే అవకాశాలున్నాయి. గతంలో కూడా వీరిపై ఇలాగే శిక్షలు అమలు చేసినట్లు తెలుస్తోంది. మహిళల పట్ల వారి అరాచకాలు కొనసాగుతున్నాయి. పెళ్లీడుకొచ్చిన వారిని ఇళ్లలో నుంచి లాక్కెల్లి పెళ్లిళ్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మహిళల భద్రతపై అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశం వారికి మద్దతుగా ప్రత్యక్ష కార్యాచరణకు దిగే సూచనలు కనిపించడం లేదు. మహిళలు తాలిబన్లపై తిరగబడుతున్నారు. తమకు హక్కులు కావాల్సిందేనని చెబుతున్నారు. శనివారం మహిళలు కాబుల్ లో నిరసన తెలిపారు. తాలిబన్లు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించి చెదరగొట్టారు. ఈ పరిస్థితులు చూస్తుంటే అఫ్గన్ లో అంతర్యుద్ధం ఖాయమని తెలుస్తోంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version