https://oktelugu.com/

Disha Case: ‘దిశా రేప్’ కేసు: రవితేజ, రకుల్ పై కేసు.. ఎందుకంటే?

Disha Case: టాలీవుడ్ , బాలీవుడ్ సినీ ప్రముఖులు చిక్కుల్లో పడ్డారు. అగ్రహీరోలు సల్మాన్ ఖాన్, రవితేజ, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పై తాజాగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ లు వివిధ విచారణలను ఎదుర్కొంటున్నారు. తాజాగా వీరిపై మరో కేసు నమోదుకావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. 2019లో నవంబర్ 27న దేశం మొత్తం రగిలిపోయిన ‘దిశా’ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 5, 2021 / 04:21 PM IST
    Follow us on

    Disha Case: టాలీవుడ్ , బాలీవుడ్ సినీ ప్రముఖులు చిక్కుల్లో పడ్డారు. అగ్రహీరోలు సల్మాన్ ఖాన్, రవితేజ, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పై తాజాగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

    ఇప్పటికే డ్రగ్స్ కేసులో రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ లు వివిధ విచారణలను ఎదుర్కొంటున్నారు. తాజాగా వీరిపై మరో కేసు నమోదుకావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

    2019లో నవంబర్ 27న దేశం మొత్తం రగిలిపోయిన ‘దిశా’ హత్యోదంతం పెద్ద సంచలనమైంది. నలుగురు కామాంధులు యువ వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటనతో దేశమంతా ఊగిపోయింది. నిరసన బాట పట్టింది.

    అయితే వైద్యురాలి పేరు, ఫొటోలు బయటకు రాకుండా ‘దిశ’ అని ఆమెకు పేరు పెట్టారు. వారి గౌరవానికి భంగం కలుగకుండా ప్రభుత్వం, మీడియా సంయమనం పాటించింది. బాధితురాలి పేరును బయటకు చెప్పొద్దు.. అలా చెబితే వారి కేసు నమోదు అవుతుంది.

    అయితే ఈ విషయం తెలియక బాధితురాలి పేరును సోషల్ మీడియా వేదికగా బయటకు తెలిపారు సల్మాన్ ఖాన్, రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ లు. వీరితోపాటు మరో 30 మందిపై కూడా ఈ కేసు నమోదైంది.

    ఇందులో హీరోలు అక్షయ్  కుమార్, అజయ్ దేవ్ గన్, అబిషేక్ బచ్చన్, ఫరాన్ అక్తర్, అనుపమ్ ఖేర్ తోపాటు టాలీవుడ్ నటులు అల్లు శీరిష్, చార్మిలపై కూడా కేసు నమోదైంది.

    బాధితురాలి పేరును బయట పెట్టినందుకు గాను ప్రముఖులను అరెస్ట్ చేయాలని కోరుతూ ఢిల్లీ తీజ్ హజారీ కోర్టులో తాజాగా పిటీషన్ దాఖలైంది. న్యాయవాది గౌరవ్ గులాటి ఈ పిటీషన్ దాఖలు చేశారు. సెక్షన్ 228 ఏ కింద ప్రముఖులపై కేసు నమోదు చేయాలని.. సబ్జి మండి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు గౌరవ్.

    ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి సినీ ప్రముఖులకు షాకిచ్చారు. ఇదిప్పుడు సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది.