RGV on RRR: రామ్ గోపాల్ వర్మకు వివాదానికి విడదీయరాని సంబంధం ఉంది. వివాదం అనేది వర్మకి ఎప్పుడూ నీడలా ఉంటుంది. ఆయన సినిమాలకు అదే ప్రధాన పెట్టుబడి. ఇక ఆయనకు వివాదమే ఎంటర్ టైన్మెంట్. అందుకే, ఈ సంచలన దర్శకుడు ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉంటారు. దీనికి తోడు రామ్ గోపాల్ వర్మకు ట్విట్టర్ కి విడదీయరాని సంబంధం ఉంది. అందుకే, వర్మను ‘ట్విట్టర్ వర్మ’ అని పిలుస్తున్నారు ఈ మధ్య. తాజాగా వర్మ ‘ఆర్ఆర్ఆర్’ గురించి కూడా ఒక ట్వీట్ పెట్టాడు.

బాహుబలితో ‘ఆర్ఆర్ఆర్’ని పోలుస్తూ ఇదొక చారిత్రాత్మక చిత్రం అని వర్మ కొనియాడాడు. ‘బాహుబలి-2 అనేది చరిత్ర.. ‘ఆర్ఆర్ఆర్’ అనేది చారిత్రాత్మకం’ అంటూ వర్మ తనదైన శైలీలో స్పందించాడు. అలాగే వర్మ.. రాజమౌళి గురించి కూడా ట్వీట్ చేస్తూ.. ‘దర్శకుడు రాజమౌళి బాక్సాఫీస్‌కు మోక్షం కలిగించిన గొప్ప వ్యక్తి అనే అర్థం వచ్చేలా ఆర్జీవీ మరో కామెంట్ పెట్టాడు.
ప్రస్తుతం వర్మ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఏది ఏమైనా తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పబ్లిసిటి చేసుకోవడంలో వర్మ తర్వాతే ఎవరైనా. గొప్ప టాలెంట్ ఉన్న వర్మ ఇలా ఒక డైరెక్టర్ ను పొగుడుతూ ట్వీట్ చేయడం చాలా అరుదు. అయినా, వర్మ ఎవరి గురించి ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడతాడో, ఎవరిని ఎప్పుడు బ్యాడ్ గా ప్రమోట్ చేస్తాడో వర్మకే తెలియదు.
Also Read: RRR Special Show In AP Bhavan: ఏపీ భవన్ లో ఆర్ఆర్ఆర్ మేనియా.. ఎన్టీఆర్ కు మాత్రం లాసే
అందుకే, వర్మ గొంతు చించుకుని ఎవరి ఎన్ని చెప్పినా ఈ మధ్య ఎవరూ ఆయనను పట్టించుకోవడం లేదు అనుకోండి. అయితే, తనను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వర్మ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఈ మధ్య వర్మ ఆశించే పబ్లిసిటీ ఆ స్థాయిలో ఆర్జీవీకి దొరకడం లేదు.
అందుకే.. కాస్త వర్మ ఈ మధ్య ఆలోచించి ట్వీట్స్ చేస్తున్నాడు. ఎంతో క్లారిటీ గా, ఫోకస్డ్ గా తనకు కావాల్సిన విధంగా కామెంట్స్ చేస్తూ ముందుకు పోతున్నాడు ఆర్జీవీ. ఏది ఏమైనా ఆర్జీవీ గత వైభవం తిరిగి రానట్టే. అయితే, ఆర్జీవీ సినిమాలు ప్లాప్ అవ్వొచ్చు, కానీ ఆర్జీవీ ప్లాప్ అవ్వడమే బాగాలేదు.
Also Read: RRR Movie: అక్కడ RRR సినిమాను చూసేందుకు ముఖం చాటేస్తున్న ప్రేక్షకులు..
BAHUBALI 2 is history, RRR is HISTORICAL and @ssrajamouli is MYSTICAL for making the boxoffice SPIRITUAL 🙏🙏🙏
— Ram Gopal Varma (@RGVzoomin) March 26, 2022
[…] Also Read: ‘బాహుబలి-2′ చరిత్ర.. ‘ఆర్ఆర్ఆర్’ చారిత… […]