ఆస్తులుపై శ్వేతపత్రం విడుదల చేయండి..!

టిటిడి ఆస్తుల వేలంపై ప్రభుత్వం వెనక్కి తగ్గిన ఆ నిర్ణయం వల్ల తలెత్తిన సమస్యలు తగ్గడం లేదు. దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు ఎప్పటికైనా చర్యలు చేపట్టాలని ప్రభుత్వంపై వత్తిడి పెరిగింది. బీజేపీ జనసేన పార్టీలు మంగళవారం ఉపవాస దీక్షలు కొనసాగించాయి. ఆస్తుల వేలం తాత్కాలికంగా మాత్రమే నిలుపుదల ఇది సమస్యకు పరిష్కారం కాదని ఆ పార్టీల న్యాయకులు అంటున్నారు. ఏ దేవాలయ ఆస్తుల విక్రయానికి అవకాశం లేకుండా ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా […]

Written By: Neelambaram, Updated On : May 27, 2020 10:10 am
Follow us on


టిటిడి ఆస్తుల వేలంపై ప్రభుత్వం వెనక్కి తగ్గిన ఆ నిర్ణయం వల్ల తలెత్తిన సమస్యలు తగ్గడం లేదు. దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు ఎప్పటికైనా చర్యలు చేపట్టాలని ప్రభుత్వంపై వత్తిడి పెరిగింది. బీజేపీ జనసేన పార్టీలు మంగళవారం ఉపవాస దీక్షలు కొనసాగించాయి. ఆస్తుల వేలం తాత్కాలికంగా మాత్రమే నిలుపుదల ఇది సమస్యకు పరిష్కారం కాదని ఆ పార్టీల న్యాయకులు అంటున్నారు. ఏ దేవాలయ ఆస్తుల విక్రయానికి అవకాశం లేకుండా ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వామి పరిపూర్ణానంద బహిరంగ లేఖ రాశారు. టిటిడి ఆస్తుల వేలం నిలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భక్తులు ఆందోళనకు రాకముందే సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ఇప్పటిదాకా పని చేసిన ముఖ్యమంత్రులు దేవాలయాలకు హిందువులకు ఒరగబెట్టింది ఏమీ లేదని పేర్కొన్నారు. వారి నిర్వాకం వల్లే 5 లక్షల కోట్ల పంట భూములు లెక్కలేని ఆభరణాలు దోపిడీ జరిగాయని పరిపూర్ణానంద అన్నారు. దేవాలయ ఆస్తులుపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.