https://oktelugu.com/

తెలంగాణ‌లో 2 వేలకు చేరువ‌లో క‌రోనా కేసులు

తెలంగాణ‌లో క‌రోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 2 వేల‌కు చేరువైంది. గ‌డిచిన 24 గంట‌ల్లో భారీగా 71 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం క‌రోనా కేసులు 1991కి చేరాయి. మంగ‌ళ‌వారం రాత్రి 8 గంట‌ల‌కు రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన రోజువారీ బులిటెన్ ప్రకారం అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 38 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. రంగారెడ్డి జిల్లాలో 7, మేడ్చ‌ల్ 6, సూర్యాపేట్, వికారాబాద్, […]

Written By: , Updated On : May 27, 2020 / 10:20 AM IST
Follow us on


తెలంగాణ‌లో క‌రోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 2 వేల‌కు చేరువైంది. గ‌డిచిన 24 గంట‌ల్లో భారీగా 71 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం క‌రోనా కేసులు 1991కి చేరాయి.

మంగ‌ళ‌వారం రాత్రి 8 గంట‌ల‌కు రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన రోజువారీ బులిటెన్ ప్రకారం అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 38 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. రంగారెడ్డి జిల్లాలో 7, మేడ్చ‌ల్ 6, సూర్యాపేట్, వికారాబాద్, న‌ల్ల‌గొండ‌, నారాయ‌ణపేట్ జిల్లాల్లో ఒక్కొక్క‌టి చొప్పున కొత్త కేసులు వ‌చ్చాయి. అలాగే 12 మంది వ‌ల‌స కార్మికుల‌కు, ఇటీవ‌ల విదేశాల నుంచి తిరిగొచ్చిన న‌లుగురికి పాజిటివ్ వ‌చ్చింది.

గ‌డిచిన 24 గంట‌ల్లో భారీగా క‌రోనా పేషెంట్లు రివ‌క‌రీ అయ్యారు. ఒక్క రోజులో 120 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1284కు చేరింది. ఇవాళ కొత్త‌గా ఒక క‌రోనా పేషెంట్ మ‌ర‌ణించ‌డంతో మొత్తం మృతుల సంఖ్య 57కు పెరిగింది. ప్ర‌స్తుతం ఆస్ప‌త్రుల్లో 650 మంది చికిత్స పొందుతున్నారు.

కాగా, కొద్ది వారాలుగా కొత్త కేసులు లేని మేడ్చ‌ల్, సూర్యాపేట్, వికారాబాద్, న‌ల్ల‌గొండ‌, నారాయ‌ణ పేట్ జిల్లాల్లో మ‌ళ్లీ క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో గ‌డిచిన 14 రోజులుగా కొత్త కేసులు న‌మోదు కాని జిల్లాల సంఖ్య 21కి త‌గ్గింది.