Sushmita Sen : మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచిన తర్వాత సుస్మితా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన కెరీర్ ప్రారంభించింది. సుస్మిత తన అద్భుతమైన నటన, ప్రతిభ కారణంగా చాలా పాపులర్ అయింది. సుస్మితా సేన్, సల్మాన్ ఖాన్ జోడీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. తెరపై ఈ జంటను చూశారంటే అభిమానులకు పండగే. తాజాగా సుస్మితా సేన్ సల్మాన్ ఖాన్‌పై తనకున్న పిచ్చి ఇష్టాన్ని బయటపెట్టింది. తన యుక్తవయస్సులో సల్మాన్ ఖాన్‌పై తనకు ఎంత పిచ్చి ఉండేదో.. సల్మాన్ పోస్టర్లను కొనడానికి తన పాకెట్ మనీ మొత్తాన్ని ఖర్చు చేసేదని సుస్మిత సేన్ చెప్పుకొచ్చింది. ఆమె బెడ్ రూం నిండా సల్మాన్ ఖాన్ పోస్టర్లే ఉండేవట.
సల్మాన్ చిత్రం మైనే ప్యార్ కియా విడుదలైనప్పుడు, ఆ తర్వాత ఈ చిత్రం పోస్టర్లను తన గదిలో ఉంచుకునే దానినని సుస్మితా సేన్ తెలిపింది. అంతే కాదు, సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ పై సుస్మితకి ఉన్న మక్కువ వల్ల ఆమె కుటుంబ సభ్యులు ఆ పోస్టర్లను తొలగించలేదు. ఎందుకంటే స్కూల్ టైంలో ఆమె తన హోం వర్క్ సమయానికి పూర్తి చేయకపోతే పోస్టర్ల తీసేస్తామని వారి తల్లిదండ్రులు బెదిరించేవాళ్లట.
పోస్టర్ల కోసం పాకెట్ మనీ ఖర్చు
సుస్మితా సేన్ ఇటీవల షిప్రా నీరజ్ యూట్యూబ్ ఛానెల్లో తన యుక్తవయస్సులోని కొన్ని అందమైన జ్ఞాపకాలను ప్రస్తావించింది. సుస్మితా సేన్ తన యుక్తవయస్సులో సల్మాన్ ఖాన్ పై తనకు ఉన్న అమితమైన ఇష్టం గురించి కూడా మాట్లాడింది. సుస్మితా సేన్ మాట్లాడుతూ, “నాకు వచ్చిన పాకెట్ మనీతో నేను సల్మాన్ పోస్టర్లను కొనేదానిని.. ఆ రోజుల్లో మైనే ప్యార్ కియా ఇప్పుడే విడుదలైంది, నా దగ్గర కూడా ఆ పావురం ఫోటో ఉండేది, ఎందుకంటే అది సల్మాన్ ఖాన్ సినిమా. ఆ పోస్టర్లు తనకు ప్రేరణనిచ్చాయని సుస్మిత తెలిపింది.
ఆ పోస్టర్లు తనకు చాలా ముఖ్యమైనవని సుస్మితా సేన్ తన హోంవర్క్‌ని సమయానికి పూర్తి చేసేదని చెప్పింది. సుస్మితా సేన్ మాట్లాడుతూ, “నేను నా హోమ్‌వర్క్ సమయానికి పూర్తి చేయకపోతే, మేము అన్ని పోస్టర్లను తీసివేస్తామని మా తల్లిదండ్రులు ఎప్పుడూ నన్ను బెదిరించే వారు. కాబట్టి నేను ఎల్లప్పుడూ నా హోమ్‌వర్క్‌ను సమయానికి పూర్తి చేశాను, ఎందుకంటే ఆ పోస్టర్లు నాకు చాలా ముఖ్యమైనవి, నేను ఆ వ్యక్తిని ప్రేమించాను.’’ అని చెప్పుకొచ్చారు.
ఈ విషయాలను సుస్మిత సల్మాన్‌కి చెప్పిందట
చాలా ఏళ్ల తర్వాత సుస్మితా సేన్‌కి సల్మాన్‌తో కలిసి నటించే అవకాశం వచ్చింది. ఆమె బీవీ నంబర్ 1 సెట్స్‌లో సల్మాన్‌ను కలుసుకుంది. అప్పటి నుంచి ఇద్దరూ స్నేహితులు అయ్యారు. సల్మాన్‌తో స్నేహం అయిన తర్వాత తన క్రష్ గురించి చెప్పానని సుస్మిత తెలిపింది. సుస్మిత మాట్లాడుతూ, “నాకు 15 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు.. నేను మీ టీనేజ్ ఫోటో చూశానని ఒక రోజు సల్మాన్ నాతో చెప్పాడు. మీకు ఇష్టమైన సినిమా ఏది? అని అడిగితే నేను మైనే ప్యార్ కియా అని నేను చెప్పాను, నేను అప్పుడు సల్మాన్ ను ప్రేమించాను.’’ అప్పుడు సల్మాన్ మాట్లాడుతూ..‘‘నేను డేవిడ్ ధావన్ వద్దకు వెళ్లాను, నేను సుస్మితతో సినిమా చేయాలనుకుంటున్నాను అని చెప్పాను చెప్పినట్లు సుస్మిత తెలిపింది. తర్వాత నే సల్మాన్ ఖాన్, సుస్మితా సేన్ ‘మైనే ప్యార్ క్యున్ కియా’ చిత్రంలో కలిసి కనిపించారు.