Survey Report: రాజకీయాలన్నాక గెలుపోటములు అత్యంత సహజం. అందుకే రాజకీయ నేతలు ఒక దఫా ప్రతిపక్షంలో ఉన్నా కుంగిపోరు. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల తరుఫున పోరాడి మళ్లీ అధికారం సాధిస్తారు. అయితే ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావడానికి, ఓడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి.
ఉమ్మడి ఏపీ విడిపోయి రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ గెలిచి తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ చేతిలో టీడీపీ దారుణంగా ఓడిపోయింది. ఏకంగా 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు సాధించి వైసీపీ ఏపీ చరిత్రలోనే అత్యధిక సీట్లతో సత్తా చాటింది. ఈ ఫలితాల తర్వాత కూడా వైసీపీ ప్రభంజనం కొనసాగుతోంది. దీంతో వయసు అయిపోయిన చంద్రబాబు పని అయిపోయిందని.. టీడీపీ ఎప్పటికీ పుంజుకోదనే అనుమానాలు అందరిలోనూ బలపడ్డాయి. టీడీపీని ఇక జగన్ గెలవనీయడని అంతా అనుకుంటున్నారు.
యువకుడు, ఉత్సాహవంతుడైన జగన్ పాలిట్రిక్స్ ను ఎదుర్కొలేక 40 ఇయర్స్ పాలిటిక్స్ అయిన చంద్రబాబు కూడా బోరున ఏడ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇక జగన్ కు తిరుగులేదన్న విశ్వాసం ఆ పార్టీ కేడర్ లో కనిపిస్తోంది. బలమైన ఎల్లో మీడియా జగన్ పాలనలో ఏపీ అతాలకుతలం అయ్యిందని ఎంత ప్రచారం చేస్తున్నా ప్రజలెవరు నమ్మని పరిస్థితి నెలకొంది.
ఇక జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. కానీ పెట్టుబడులతో ఆదాయాన్ని సమకూర్చే అభివృద్ధిని విస్మరించారు. దీంతో ఆదాయం కోల్పోయి అప్పుల పాలయ్యారన్న విమర్శ ఉంది. ఈ విషయాన్ని టీడీపీ, దాని మీడియా తెగ ప్రచారం చేస్తోంది. అయితే ప్రజలు దీన్ని ఎంతవరకూ దృష్టిలో ఉంచుకున్నారో ఎవరికి తెలియదు. అయితే ఇటీవల ఒక సంస్థ చేసిన సర్వేలో రాష్ట్రంలో జగన్ పై ప్రజల్లో అంత వ్యతిరేకత లేదని తేలిందట.. రెండేళ్లలో ఏం చేసినా జగన్ పై వ్యతిరేకత పెరిగినా కూడా 2024లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని.. మెజారిటీ సాధిస్తుందని ఓ సర్వే తేల్చింది.
Also Read: ఏపీ ఉద్యోగులకు జగన్ పీఆర్సీ ట్విస్ట్.. 11 మంది ప్రతిపాదనలు ముందుకు..
అయితే రానున్న రెండేళ్లలో టీడీపీ ఘననీయంగా పుంజుకుంటుందని సర్వే తేల్చింది. మళ్లీ అధికారంలోకి రాకపోయినా పరిస్థితి ఇలాగే కొనసాగితే గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన సీట్ల సంఖ్యకు కోత పడవచ్చని సర్వే చెబుతోంది. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లు ఉన్నందున ఈ సర్వే నిజమవుతుందని అంచనాకు రావడం కష్టమే.
కాబట్టి ఏదైనా ఊహించడం చాలా తొందర అవుతుందని చెప్పొచ్చు. సమయం, అప్పటి రాజకీయాలు, పార్టీల ప్రభావం, ప్రజల నాడిని బట్టి వచ్చేసారి గెలుపు ఎవరిది అనేది నిర్ణయించబడుతుంది. అధికార పార్టీపై వ్యతిరేకతను నిరోదించేందుకు ఆదాయాన్ని సమకూర్చే దిశగా వైసీపీ కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పొచ్చు.
Also Read: జగన్ కు ప్రాణభయం పొంచి ఉందట?