Minister Srinivas Goud Case: హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధుల కోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులపై కేసులు నమోదు చేయాలని తీర్పు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీనివాస్‌గౌడ్‌పై కేసు వరకూ ఓకే కానీ.. ఇందులో ఎన్నికల సంఘంపైనా కేసులు నమోదు చేయించడం పోలీసులకు డెడ్‌లైన్ పెట్టి మరీ కేసులు పెట్టించంపై ఈసీ సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. స్పందించిన సుప్రీంకోర్టు హైదరాబాద్ ప్రజాప్రతినిధుల కోర్టు న్యాయమూర్తి తీరును తప్పు పట్టింది. రాజ్యాంగ సంస్థలపై కేసు పెట్టమనడం రాజ్యాంగ విరుద్ధమని భావించింది. దీంతో న్యాయమూర్తిపై సస్పెన్షన్ వేటు వేసింది.
అవిడవిట్ ట్యాంపర్ చేసిన శ్రీనివాస్‌గౌడ్..
2018 ఎన్నికల సమయంలో శ్రీనివాస్‌గౌడ్ అఫిడవిట్‌ను ట్యాంపర్ చేశారు. గడువు ముగిసిన తర్వాత ఈసీ అధికారుల సాయంతో పాతది డిలీట్ చేసి కొత్తది అప్‌లోడ్ చేశారు. ఈమేరకు రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి హైదరాబాద్ నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.
ఈసీపై కేసుకు వెనుకడుగు..
కానీ ఈసీ సహా రాజ్యాంగ సంస్థ అధిపతులపైకేసులు నమోదుచేయాలని ఉండటంతో పోలీసులు తటపటాయించారు. కేసు నమోదు చేయకపోతే కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కోవాల్సి వస్తుందని మహబూబ్‌నగర్ పోలీసులకు జడ్జి హెచ్చరించారు. కోర్టు హెచ్చరికలతో.. ధిక్కరణ కేసు ఎదుర్కోవాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించడంతో మహబూబ్‌నగర్ టూ టౌన్ పోలీసులు స్పందించారు . శ్రీనివాస్‌గౌడ్ పై కేసు వరకూ ఓకే కానీ.. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థలపై ఇలా కేసుల నమోదుకు ప్రజాప్రతినిధుల కోర్టు న్యాయమూర్తి ఆదేశించడం నిబంధనలకు విరుద్ధమని భావించిన సుప్రీంకోర్టు జడ్జిని సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారం న్యాయవర్గాల్లో సంచలనం సృష్టించింది.
శ్రీనివాస్‌గౌడ్‌కు ఊరట..
తెలంగాణ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి సస్పెన్షన్‌తో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు పెద్ద ఊరట లభించింది. కేసులు నమోదు చేయాలని జడ్జి ఇచ్చిన ఆదేశాలు కూడా చెల్లవని సుప్రీం కోర్టు తెలిపింది. దీంతో పోలీసులు ఇటీ వల శ్రీనివాస్‌గౌడ్‌పై నమోదు చేసిన కేసు కూడా రద్దయింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి దూకుడుతో శ్రీనివాస్‌గౌడ్‌పై వేటు పడుతుందని అంతా భావించారు. కానీ జడ్జితోపాటు ఆయన ఆదేశాలను సుప్రీం కోర్టు సస్పెండ్ చేయడంతో మంత్రితోపాటు బీఆర్‌ఎస్‌కు ఊరట లభించినట్లయింది.