
MLAs Poaching Case- Supreme Court: ఫిబ్రవరి 17, తెలంగాణ ఉద్యమ సారథి, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు. ఎన్నికల ఏడాది కావడంతో పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు, మంత్రులు సార్ పుట్టిన రోజు ఘనంగా నిర్వహించేందుకు ఒకరికి మించి మరొకరు ఏర్పాట్లు చేశారు. అయితే బీఆర్‌ఎస్ క్యాడర్ సంబరాలకు కిక్ ఉంటుందా లేకపోతే దిగిపోతుందా అన్న ఉత్కంఠ నెలకొంది.
ఎమ్మెల్యేల ఎర కేసుపై సుప్రీంలో విచారణ..
ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 17వ తేదీన విచారణ జరగనుంది, సుప్రీంకోర్టులో సీబీఐ దర్యాప్తు చేయడం సరికాదన్న తీర్పు వస్తే సరే లేకపోతే.. సీబీఐ ఒక్క సారిగా పంజా విసిరే అవకాశం కనిపిస్తోంది. నిజానికి పిటిషన్ వేసినప్పుడు ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తీర్పు అమలుపై స్టే కోరినా సుప్రీంకోర్టు ఇవ్వలేదు. అయినా సిట్ వద్ద ఉన్న డీటెయిల్స్ ఇవ్వడానికి తెంంగాణ సీఎస్ సిద్ధం కాలేదు. వాటి కోసం ఎస్పీ స్థాయి అధికారి సీఎస్‌కి ఆరుసార్లు లేఖ రాశారు. సుప్రీంలో విచారణ తర్వాత ఇస్తామని చెబుతున్నారు. అందుకే శుక్రవారం ఏం జరగబోతుందని ఉత్కంఠ నెలకొంది.
సీబీఐ కోర్టు ధిక్కరణ పిటిషన్?
ఒకవైపు సుప్రీం తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతుండగానే సీబీఐ మరో పిటిన్ వేయడానికి రెడీ అవుతోంది. హైకోర్టు తీర్పును అమలు చేయడం లేదని కేసీఆర సర్కార్‌పై కోర్టు ధిక్కరణ కేసు ఫైల్ చేయనున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఫాంహౌస్ కేసు విచారించేందుకు సీబీఐ అధికారులు ప్రత్యేక బృందంగా ఏర్పడ్డారు. మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ ఎఫ్‌ఐఆర్, ఆనాటి ఫుటేజీని పరిశీలించారు. సీఎం వద్దకు ఎవరు చేరవేశారో కాల్ డేటా, టవర్ లొకేషన్స్ పరిశీలించారు. పోలీస్ అధికారుల టైమింగ్స్, ఎమ్మెల్యేల స్పై కెమెరాలను సరిచూసుకున్నారు. టెక్నికల్‌గా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండానే ఎవరెవరని విచారించాలో ప్లాన్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఒకవైపు కేసీఆర్ బర్త్‌డే సంబురాలు జరుగుతుండగానే సుప్రీంకోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉంది. ప్రభత్వానికి వ్యతిరేకంగా తీర్పు రాగానే విరుచుకుపడేందుకు సీబీఐ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుని రెడీగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.