Sunita Williams : గడచిన తొమ్మిది నెలలుగా సునీత అంతరిక్ష కేంద్రంలోనే ఉంటున్నారు. ఆమెతోపాటు బచ్ విల్ మోర్( Butch Wilmore) కూడా అక్కడే ఉండాల్సి వస్తోంది. వారిని భూమికి తిరిగి తీసుకురావడానికి నాసా(NASA) – స్పేస్ ఎక్స్(Space x) ప్రయోగించిన క్రూ – 10 మిషన్ వాయిదా పడింది. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి నలుగురు వ్యోమగాములతో
ఫాల్కన్ -9 రాకెట్ తో బయలుదేరడానికి క్రూ మిషన్ రెడీ అయింది. మరి కొద్ది క్షణాల్లో అంతరిక్షంలోకి వెళుతుంది అనగా ప్రయోగం ఒక్కసారిగా ఆగిపోయింది. హైడ్రాలిక్ విధానంలో సమస్య ఏర్పడడంతో.. ప్రయోగాన్ని నిలిపివేశామని నాసా వెల్లడించింది. ప్రస్తుతం తలెత్తిన సమస్యను వారంలోగా పరిష్కరించి.. మరో ప్రయోగం చేస్తామని నాసా(NASA) వెల్లడించింది. దీంతో సునిత, విల్ మోర్ రాక మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. సరిగ్గా గత ఏడాది జూన్ 5న బోయింగ్ వ్యోమ నౌక స్టార్ లైనర్ లో సునీత, విల్ మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ISS) చేరుకున్నారు. ముందస్తుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీత విలియమ్స్, విల్ మోర్ కేవలం వారం రోజులకే భూమికి రావలసి ఉంది.. అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో అది వ్యోమగాములు లేకుండానే భూమికి వచ్చింది. సునీత విలియమ్స్, విల్ మోర్ అప్పటినుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉంటున్నారు. వారిని తిరిగి తీసుకొచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ తో కలిసి ప్రయోగాలు చేస్తోంది.
Also Read : అంతరిక్షంలో రికార్డు సృష్టించిన సునీతా విలియమ్స్.. ఈ సమయంలో ఆమె ఏమి చేసిందో తెలుసా?
కొంతమందిని పంపించాలి..
సునీత, విల్ మోర్ ను భూమ్మీదకి తీసుకురావాలంటే.. దాని కంటే ముందు కొంతమంది వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించాలి. ఈ ప్రయోగం చేపట్టడానికి స్పేస్ ఎక్స్ కొంత సమయం గురించి. దీంతో ఈ ప్రయోగంలో ఆలస్యం చోటుచేసుకుందని అప్పట్లో నాసా అధికారులు వెల్లడించారు. సునీత, విల్ మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి కొద్ది రోజుల క్రితం మీడియాతో మాట్లాడారు. ” మాకోసం మార్చి 12న స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ – 10 అంతరిక్ష నౌక రానుంది. నౌకలో కొత్తగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వచ్చే వ్యోమగాములు బాధ్యతలు తీసుకుంటారు. తర్వాత మార్చి 19న ఆ నౌకలోనే మేము భూమి మీదకు రావడానికి బయలుదేరుతామని” సునీత ప్రకటించారు. అయితే అనుకోకుండా ఈ ప్రయోగం నిలుపుదల కావడంతో సునీత, విల్ మోర్ భూమ్మీదకు తిరిగి రావడానికి మరి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. గతంలో బోయింగ్ సంస్థ చేసిన ప్రయోగాలు విఫలం కావడంతో నాసా స్పేస్ ఎక్స్ సాయం కోరింది. స్పేస్ ఎక్స్ రంగంలోకి దిగి ప్రయోగాలు చేసే సమయం వరకు.. కాలం గడిచిపోయింది. ఆ ప్రయోగం పూర్తయి టెస్టింగ్ దశలో ఉండగా కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. వాటిని పరిష్కరించి.. మళ్లీ ప్రయోగాన్ని మొదలుపెట్టేసరికి ఇప్పుడు ఈ పరిస్థితి చోటుచేసుకుంది. మరో వారం తర్వాత క్రూ -10 ను అంతరిక్షంలోకి ప్రయోగించి.. అక్కడ ఉన్న సునీత, విల్ మోర్ ను భూమికి తీసుకొస్తామని నాసా, స్పేస్ ఎక్స్ అధికారులు చెబుతున్నారు.
Also Read : సునీతా విలియమ్స్‌ను తీసుకురండి.. అగ్రరాజ్యాధినేతకు ప్రపంచ కుభేరుడి వినతి!