PMO: భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ కార్యాలయం వివాదంలో చిక్కుకుంది. ఎలక్షన్స్ కండక్ట్ చేసే విషయంలో కీలకమైన సంస్కరణల విషయమై చర్చించేందుకుగాను పీఎం ఆఫీసుకు రావాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లను పీఎంవోకు రావాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కార్యాలయం నుంచి లెటర్ వచ్చిందనే విషయమై వివాదం చెలరేగుతోంది. గత నెల 16న ఈ సమావేశం జరిగిందనే విషయం బయటకు వచ్చింది. ఇందుకుగాను పీఎంవో ఆఫీసు నుంచి డైరెక్షన్స్ అందాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీలన్నీ పీఎంవోపై ఫైర్ అవుతున్నాయి.

భారత రాజ్యాంగ ప్రకారం.. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను కేంద్రప్రభుత్వం, ప్రధానమంత్రి, ఆయన కార్యాలయం గౌరవించాల్సి ఉంటుంది. కానీ, సంస్థల స్వయం ప్రతిపత్తికి తూట్లు పొడుస్తూ ప్రధానమంత్రి కార్యాలయానికి ఎన్నికల కమిషనర్లను రావాలని పిలవడం సరికాదని అంటున్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలు రాష్ట్రపతికి మాత్రమే జవాబుదారీగా ఉంటాయి. సంస్కరణల విషయమై నివేదికల రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ప్రధానమంత్రి కార్యాలయం వద్దకు వెళ్లి చర్చించాల్సిన అవసరం లేదని ప్రతిపక్ష పార్టీల నేతలు అంటున్నారు.
ఈ క్రమంలోనే ఎన్నికల కమిషనర్, అధికారులు గట్టిగా లేరని కొందరు నేతలు విమర్శిస్తున్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలో పని చేసే అధికారులు ప్రధాన మంత్రి కార్యాలయం ఇచ్చే సూచనల ప్రకారం వ్యవహరించాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. పీఎంవో ఎన్నికల కమిషన్‌ను నియంత్రించే ప్రయత్నం చేయొద్దని సూచిస్తున్నారు.
Also Read: Marriage Age: అమ్మాయిల వివాహ వయసు పెంచితే సరిపోతుందా.. పోషకాహార లోపాన్ని అరికట్టొద్దా..?
అలా చేయడం రాజ్యాంగ ఉల్లంఘన అని వివరిస్తున్నారు. మొత్తంగా ప్రతిపక్ష పార్టీలన్ని కలిసి ఈ విషయమై రచ్చరచ్చ చేయబోతున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయంలో జరిగిన విషయం సరికాదని అంటున్నారు. ఇదే సమయంలో దేశానికి కీలకమైన ఎన్నికల కమిషనర్లు స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్న సంస్థలో పని చేస్తున్నామని భావించాలని, పీఎంవో ఆఫీసు నుంచి వచ్చే ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో కావాల్సిన అవసరం లేదని గుర్తెరగాలని అంటున్నారు.
Also Read: Omicron in India: దేశాన్ని ఒమిక్రాన్ వైరస్ కమ్మేస్తోందా? 3వ వేవ్ తప్పదా?