Sukesh Chandrashekar: జైల్లోనే ఆఫీసు పెట్టాడు.. ఏకంగా సినీ ఇండస్ట్రీనే షేక్ చేశాడు.. చివరకు ట్విస్ట్

Sukesh Chandrashekar: సుఖేష్ చంద్రశేఖర్.. ఢిల్లీలోని తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆర్థిక మోసగాడు సుఖేష్ మరోసారి తనకు బెయిల్ కావాలంటూ సుప్రీం కోర్టు గడప తొక్కాడు. తనకు జైలులో ప్రాణాలకు ప్రమాదం ఉందని.. వేరే జైలుకు మార్చాలని సుప్రీంకోర్టు వరకూ వెళ్లాడు. ప్రస్తుతం సుప్రీంకోర్టు దీనిపై విచారణ జరుపుతున్న వేళ కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఎంటర్ అయ్యి అతడిని జైలు నుంచి మార్చవద్దని ఆధారాలతో అఫిడవిట్ దాఖలు చేసింది. అదే ఇప్పుడు వైరల్ గా […]

Written By: NARESH, Updated On : June 22, 2022 10:43 pm
Follow us on

Sukesh Chandrashekar: సుఖేష్ చంద్రశేఖర్.. ఢిల్లీలోని తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆర్థిక మోసగాడు సుఖేష్ మరోసారి తనకు బెయిల్ కావాలంటూ సుప్రీం కోర్టు గడప తొక్కాడు. తనకు జైలులో ప్రాణాలకు ప్రమాదం ఉందని.. వేరే జైలుకు మార్చాలని సుప్రీంకోర్టు వరకూ వెళ్లాడు. ప్రస్తుతం సుప్రీంకోర్టు దీనిపై విచారణ జరుపుతున్న వేళ కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఎంటర్ అయ్యి అతడిని జైలు నుంచి మార్చవద్దని ఆధారాలతో అఫిడవిట్ దాఖలు చేసింది. అదే ఇప్పుడు వైరల్ గా మారింది.

రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్ కు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసిన కేసులో సుఖేష్ గత కొన్ని నెలలుగా తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే జైలుకు వెళ్లినప్పటికీ అతడు తన తీరు మార్చుకోలేదు సరికదా.. అక్కడి నుంచే నేరాలకు పాల్పడినట్టు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకోసం జైలు సిబ్బందికి పెద్ద ఎత్తున లంచాలు ఇచ్చినట్లు సమాచారం.

జైల్లో మొబైల్ ఫోన్ వినియోగించేందుకే 15 రోజులకు రూ.60-70 లక్షలు ఇచ్చినట్లు సదురు కథనాలు తెలిపాయి.. జైలు గదిలో లగ్జరీ సదుపాయాలతోపాటు స్వేచ్ఛగా ఉండేందుకు ప్రతినెల రూ.కోటి వరకూ ఇచ్చినట్టు తెలిసింది. ఇక జైల్లో ఉన్న సుఖేశ్ ను జాక్వెలిన్ ఫెర్నాండెస్, నోరా ఫతేహీతో పాటు చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు, మోడల్స్ వచ్చేవారని సదురు కథనాలు పేర్కొన్నాయి. మొత్తం 12మంది హీరోయిన్లు, మోడల్స్ జైల్లో అతడిని కలిసినట్లు సమాచారం. అంతేగాక జైల్లో సిబ్బందికి సుఖేశ్.. చికెన్ పార్టీలు కూడా ఇచ్చేవాడని ఆ కథనాల ద్వారా తెలిసింది.

ఇలా లోపలే ఒక రెండు బ్యారక్ లను ఆఫీసులుగా మార్చి జైలు సిబ్బందిని లంచాలతో కొనేసి బయట దందాలు అన్నీ జైలు నుంచే నడిపిస్తున్నట్టు తేలింది. పెద్ద ముఠాగా ఏర్పడి జైలు నుంచే ఆపరేట్ చేస్తున్నట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. ఇది గమనించి జైలు సిబ్బందిని బదిలీ చేసి సుఖేష్ ను సాధారణ ఖైదీగా గదిలోకి మార్చారు.

దీంతో తనకు భద్రత లేదని వేరే జైల్లోకి మార్చాలని సుకేష్ సుప్రీంకోర్టుకు ఎక్కాడు. జైల్లో అతడు చేసిన దందాలు, బాగోతాలన్నీ ఈడీ సుప్రీంకోర్టుకు సమర్పించడంతో అంతా బయటపడింది. తీహార్ జైల్లో తన ఆటలు సాగకుండా అందరినీ బదిలీ చేయడంతో వేరే జైలుకు మకాం మార్చాలని సుఖేష్ సుప్రీంకోర్టుకు ఎక్కాడని ఈడీ తేల్చింది. ఇది తెలిసి సుప్రీంకోర్టు షాక్ అయ్యింది. వందల కోట్లతో జైల్లోనే ఒక ఆఫీసు పెట్టి సెటిల్ మెంట్లు చేస్తున్న సుఖేష్ ను వేరే జైలుకు మార్చేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసి షాక్ ఇచ్చింది.