Ratan Tata Passed Away: రచయిత్రి-ఫిలాంతరపిస్ట్, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి గురువారం (అక్టోబర్ 10) ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు నివాళులర్పించారు, ఆయన మరణం ‘యుగానికి ముగింపు’ అని అన్నారు, ‘నా వ్యక్తిగత జీవితంలో ఇది ఒక శూన్యం’ అని భావిస్తున్నానని తెలిపారు. ‘..నా జీవితంలో, నేను అతన్ని (రతన్ టాటా) కలిశాను, నీతి, సరళత, ఎప్పుడూ ఇతరుల పట్ల గౌరవం, కరుణతో ఉండే వ్యక్తి.. నేను నిజంగా అతన్ని కోల్పోతున్నాను.. నా అనుభవంలో నేను కలుసుకున్న వ్యక్తుల్లో రతన్ టాటా లాంటి వారు కనిపించలేదు. అతనిలా ఎవరున్నా నేను వారిని గౌరవిస్తాను. అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఇది నాకు ఒక శకం ముగింపు’ అన్నారు. టాటా ‘సమగ్రత కలిగిన వ్యక్తి’ అని, ప్రతీ వ్యక్తి జీవితంలో ఇది చాలా ముఖ్యమైనదని మూర్తి అన్నారు. ‘అతనికి అపారమైన సహనం ఉంది. అతను సాధారణ వ్యక్తి. నేను టాటాస్ హౌస్‌లోనే దాతృత్వాన్ని నేర్చుకుంటాను. ఇది నా వ్యక్తిగత నష్టం.. నా వ్యక్తిగత జీవితంలో ఇప్పుడు శూన్యం ఆవహించింది’ అని ఆమె మరోసారి చెప్పుకచ్చారు.
-టాటా సంస్థలో తొలి మహిళా ఇంజినీర్ గా సుధామూర్తి ప్రయాణం స్టార్ట్
సుధామూర్తి ఇప్పుడు టాటా మోటార్స్ అని పిలవబడే టెల్కోలో పనిచేసిన మొదటి మహిళా ఇంజినీర్ కావడం గమనార్హం.. అక్కడే ఆమె భారతీయ పరిశ్రమకు మార్గదర్శకుడైన టాటా గ్రూప్ ఛైర్మన్ JRD టాటాను కలిశారు. JRDతో సుధా మూర్తి మొదటి ఇంటరాక్షన్ పోస్ట్‌కార్డ్ ద్వారా జరిగింది. ఆమె టెల్కోలో పని చేయాలని అనుకున్న సమయంలో లింగ వివక్ష కారణంగా దరఖాస్తు చేయలేకపోయింది. ఆ సమయంలో JRDకి సుధామూర్తి పోస్ట్‌కార్డ్ పంపారు. అందులో ఏం రాశారంటే ‘టాటాలు 1900 నుంచి దేశంలో ఉన్నత విద్యపై శ్రద్ధ వహిస్తున్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ స్థాపనకు పూనుకున్నారు. అదృష్టవశాత్తూ, నేను అక్కడ చదువుతున్నాను. కానీ, టెల్కో వంటి కంపెనీలు జెండర్ (లింగం) ఆధారంగా వివక్ష చూపుతున్నాయి. దీనికో పరిష్కారం చూపండి’ అని సుధామూర్తి లేఖ రాశారు. ఈ కార్డు పోస్ట్ చేసిన 10 రోజుల లోపే, ఆమెను ఇంటర్వ్యూ కోసం పిలిచారు, ఉద్యోగం కూడా ఇచ్చారు. అలా టాటా గ్రూపులో మొదటి మహిళా ఇంజినీర్ గా సుధామూర్తి అవతరించారు.
టెల్కోలో తను గడిపిన రోజులు, JRD టాటాను ఎలా కలుసుకున్నానో సుధామూర్తి గుర్తు చేసుకున్నారు. పూణే నుంచి బొంబాయికి బదిలీ అయ్యే వరకు JRD టాటాను కలవలేదు. ‘మన దేశంలో అమ్మాయిలు ఇంజినీరింగ్‌లో చేరడం సంతోషకరం. మీ పేరు ఏమిటి?’ అని జేఆర్ డీ టాటా అడిగారు. దానికి టెల్కోలో చేరినప్పుడు ‘నేను సుధా కులకర్ణి, సార్’ అని బదులిచ్చాను. ‘ఇప్పుడు నేను సుధామూర్తిని.’ అని ఆమె గుర్తు చేసుకున్నారు.
1982లో సుధా మూర్తి తన భర్త నారాయణ్ మూర్తితో కలిసి ఇన్ఫోసిస్‌ను ప్రారంభించడానికి టెల్కోను విడిచిపెట్టినప్పుడు ఆమె JRD టాటాకు వీడ్కోలు చెప్పడానికి ఆగిపోయింది. ఆ సమయంలో, అతను ఒక సలహా ఇచ్చాడు. ‘మీరు లైఫ్ లో సక్సెస్ సాధించిన తర్వాత సమాజానికి తిరిగి ఇవ్వాలి. సమాజం మనకు చాలా ఇస్తుంది; నేను మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను’ అని JRD టాటా తనతో చెప్పినట్టు సుధామూర్తి గుర్తు చేసుకున్నారు.
అలా టాటాలతో తన అనుబంధాన్ని సుధామూర్తి తాజాగా రతన్ టాటా మరణం నేపథ్యంలో గుర్తుచేసుకున్నారు.
టాటా సన్స్ ఎమెరిటస్ చైర్మన్, ఫిలాంతరపిస్ట్ అయిన రతన్ టాటా అక్టోబర్ 9న ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో మరణించారు. ఆయన పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేరారు. ‘టాటా గ్రూప్‌ను మాత్రమే కాకుండా దేశపు రూపురేఖలను కూడా తీర్చిదిద్దిన అసమానమైన నాయకుడు రతన్ నావల్ టాటాకు మేము వీడ్కోలు పలుకుతున్నాము’ అని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఒక ప్రకటనలో చెప్పారు.
అంతకుముందు టాటాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశం ‘కార్పోరేట్ వృద్ధిని దేశ నిర్మాణంతో, నైతికతతో మిళితం చేసిన ఒక చిహ్నాన్ని కోల్పోయింది’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. అతని కుటుంబానికి, టాటా గ్రూప్ బృందానికి సంతాపాన్ని తెలిపారు. ప్రధాని మోదీ కూడా టాటా మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఆయన దూరదృష్టి గల వ్యాపార వేత్త, దయగల వ్యక్తి, అసాధారణమైన మానవుడు అన్నారు. టాటా అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే గురువారం ప్రకటించారు.
ఆసియాన్-ఇండియా, తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ లావోస్‌కు వెళ్లగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దివంగత బిలియనీర్ పారిశ్రామికవేత్త అంత్యక్రియలకు హాజరుకానున్నారు.
#WATCH | Bengaluru, Karnataka | On the demise of Ratan Tata, author-philanthropist and Rajya Sabha MP Sudha Murty says, “… In my life, I met him (Ratan Tata), a man of integrity, and simplicity, always caring for others and compassionate… I really miss him… I don’t think in… pic.twitter.com/hDb6Qbfhau
— ANI (@ANI) October 10, 2024
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Sudha murthy recalls her memories with ratan tata
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com