Uttar Pradesh: మిగతా దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలో పెళ్లి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతుంటాయి. మిగతా దేశాలలో అయితే వివాహ వ్యవస్థను అంత బలంగా నమ్మరు. పైగా నచ్చినంత కాలం కలిసి ఉంటారు. ఆ తర్వాత విడిపోతారు.. ఆడైనా మగైనా అక్కడ రెండవ పెళ్లి చేసుకోవడం లేదా అంతకుమించి పెళ్లిళ్లు చేసుకోవడం సర్వసాధారణం. కానీ మనదేశంలో ఇప్పుడు కాస్త పరిస్థితులు మారుతున్నప్పటికీ.. ఇప్పటికీ సంస్కృతి సంప్రదాయాలు అలానే కొనసాగుతున్నాయి. వివాహ వ్యవస్థ ఇప్పటికీ బలంగానే ఉంది. అందువల్లే మనదేశంలో వివాహాలను అత్యంత వైభవంగా జరుపుతుంటారు.
వివాహం జరిగిన తర్వాత ఊరేగింపు కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా జరుపుకుంటారు. తమ స్థాయికి తగ్గట్టుగా ఊరేగింపు జరిపి అందరి దృష్టి తమ మీద పడేలా చూసుకుంటారు. ఒకప్పుడు పెళ్లి ఊరేగింపు ఇంతటి స్థాయిలో ఉండేది కాదు. కానీ ఇప్పుడు చాలామందిలో ఆర్థిక స్థిరత్వం పెరిగిపోవడం.. పైగా రకరకాల ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు రంగంలోకి రావడంతో పెళ్లి ఊరేగింపు పూర్తిగా మారిపోయింది.. ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు రకరకాల విధానాలలో పెళ్లి ఊరేగింపులను నిర్వహిస్తున్నాయి.. హంగు ఆర్భాటాలకు పెద్దపీట వేస్తున్నాయి. దీంతో ఊరేగింపు ప్రతిభ అనేది అంగరంగ వైభవంగా జరుగుతోంది.
పెళ్లి ఊరేగింపులో డ్యాన్సులు వేయడం అనేది సర్వసాధారణం. ఇంటిల్లిపాది ఆకట్టుకునే విధంగా చిందులు వేయడం అందరూ చూసేదే. అయితే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పెళ్లి ఊరేగింపు జరుగుతుంటే ఆకాశం నుంచి కరెన్సీ నోట్ల వర్షం కురిసింది. ఆ ఊరేగింపులో ఉన్న వారంతా ఆ నోట్లను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇదేంటి కరెన్సీ నోట్లు ఇలా వస్తున్నాయని ముక్కున వేలేసుకున్నారు. పైనుంచి దేవుడు పంపిస్తున్నాడని ఆకాశం వైపు చూశారు. కానీ ఆ నోట్లను దేవుడు పంపించలేదు. అవి ఆకాశం నుంచి ఊడిపడలేదు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫరూకాబాద్ ప్రాంతంలో ఓ జంట వివాహం చేసుకుంది. వివాహం అనంతరం ఊరేగింపు జరుపుకుంది. ఈ క్రమంలో దంపతుల బంధువులు కార్ల మీదికి ఎక్కారు. ఆ తర్వాత కరెన్సీ నోట్లను విసిరేస్తూ సందడి చేశారు. నీతో రోడ్డు మీద వెళ్తున్న వారంతా వాటిని తీసుకోవడానికి పోటీలు పడ్డారు. దీంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఆ తర్వాత పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. అంతేకాదు కరెన్సీ నోట్లను అలా వెద చల్లిన వ్యక్తుల మీద కేసులు నమోదు చేశారు. మీ ఉత్సాహం కోసం దేశ కరెన్సీని ఇలా అవమాన పరుస్తారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
#फर्रुखाबाद:- बारात में बारातियों ने सड़क पर लुटाए नोट, मचा हंगामा और लगा जाम।
फर्रुखाबाद के कादरी गेट थाना क्षेत्र के आवास विकास इलाके में बारात के दौरान बारातियों ने जिप्सी की छत पर चढ़कर सड़क पर नोटों की बारिश कर दी। नोट लूटने के लिए राहगीर भी दौड़ पड़े, जिससे सड़क पर कई… pic.twitter.com/BLMWzYmBo3
— UttarPradesh.ORG News (@WeUttarPradesh) November 13, 2025