Teachers: సమ్మెకు రెడీ అయ్యి పనిచేయని టీచర్లకు ఇలా షాకిచ్చారు

Teachers: వాళ్ల జీతాలు లక్ష వరకూ ఉంటాయి. పైగా ఇప్పుడు పీఆర్సీ కోసం సమ్మెకు రెడీ అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు చక్కగా చెప్పరు. ఆటపాటలతో కాలం గడుపుతారు. 100శాతం రిజల్ట్స్ కష్టమే. దీంతో అంతా ప్రైవేటు స్కూళ్ల బాట పడుతున్నారు. అయితే అందరూ ఊరుకున్నట్టు ఈ గ్రామస్థులు, విద్యార్థులు వదిలేయలేదు. టీచర్లను స్కూల్ బయట పెట్టి తాళం వేసి నిరసన తెలిపారు. ఈ స్కూల్ టీచర్లు మాకొద్దు అంటూ ఆందోళన చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి […]

Written By: NARESH, Updated On : January 25, 2022 9:30 pm
Follow us on

Teachers: వాళ్ల జీతాలు లక్ష వరకూ ఉంటాయి. పైగా ఇప్పుడు పీఆర్సీ కోసం సమ్మెకు రెడీ అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు చక్కగా చెప్పరు. ఆటపాటలతో కాలం గడుపుతారు. 100శాతం రిజల్ట్స్ కష్టమే. దీంతో అంతా ప్రైవేటు స్కూళ్ల బాట పడుతున్నారు. అయితే అందరూ ఊరుకున్నట్టు ఈ గ్రామస్థులు, విద్యార్థులు వదిలేయలేదు. టీచర్లను స్కూల్ బయట పెట్టి తాళం వేసి నిరసన తెలిపారు. ఈ స్కూల్ టీచర్లు మాకొద్దు అంటూ ఆందోళన చేశారు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం పెదమక్కెన జడ్పీ హైస్కూల్ లో నిర్ణీత వేలకు స్కూల్ కు రాని టీచర్లు మాకోద్దు అంటూ విద్యార్థులు, గ్రామస్థులు, వైసీపీ నేతలు నిరసనకు దిగారు. 100శాతం రిజల్ట్ తీసుకురాలేని టీచర్లు, చదువు చెప్పలేని టీచర్లు మాకొద్దు అని నినాదాలు చేశారు. హైస్కూల్ గేట్లకు తలుపులు వేసి ఆందోళనకు దిగారు.

లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తున్నారని.. ఇలాంటి వారు మాకొద్దు అంటూ వారు నినాదాలు చేశారు.

అయితే ఎమ్మెల్యే అంబటి రాంబాబు జోక్యం చేసుకోవడంతో ఈ ఆందోళన విరమించారు. ఈ ఆందోళనల్లో వైసీపీ నాయకులు కోటిరెడ్డి, పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ సానికొమ్ము సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీ విజయకుమారి, గ్రామ ప్రజలు, వాలంటీర్లు పాల్గొన్నారు.

ఈ ఆందోళనలోపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Tags