లాక్ డౌన్ పొడిగింపుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

దేశంలో లాక్ డౌన్ పొడిగింపుపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డికీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాను అరికట్టాలన్న లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోందని, దేశంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని , కాబట్టి ఈ పరిస్థితుల్లో లాక్‌ డౌన్‌ పూర్తి స్థాయిలో ఎత్తివేయడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కచ్చితంగా దీనిని పొడిగిస్తాం. పొడిగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలు దీనికి మానసికంగా సిద్ధం కావాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. వైరస్‌ తీవ్రత ఉన్న […]

Written By: Neelambaram, Updated On : April 30, 2020 6:55 pm
Follow us on

దేశంలో లాక్ డౌన్ పొడిగింపుపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డికీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాను అరికట్టాలన్న లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోందని, దేశంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని , కాబట్టి ఈ పరిస్థితుల్లో లాక్‌ డౌన్‌ పూర్తి స్థాయిలో ఎత్తివేయడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కచ్చితంగా దీనిని పొడిగిస్తాం. పొడిగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలు దీనికి మానసికంగా సిద్ధం కావాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.

వైరస్‌ తీవ్రత ఉన్న ప్రాంతాల్లో, రెడ్‌ జోన్లలో మరింత కఠినంగా లాక్‌ డౌన్‌ అమలు చేయాలని పలువురు ముఖ్యమంత్రులు చెబుతున్నారని . కేంద్రం కూడా అదే దృక్పథంతో ఉందని కేంద్ర కిషన్ రెడ్డి చెప్పారు. రెడ్ జోన్లలో ఎలాంటి మినహాయింపులు ఉండవు. గ్రీన్‌ జోన్లలో ఇప్పటికే అనేక సడలింపులు ఇచ్చాం. ప్రజా రవాణా, మాల్స్, థియేటర్లు వంటివి తప్ప దాదాపు అన్నింటికి అనుమతి ఇచ్చాం..’అని ఆయన వివరించారు. గ్రీన్‌ జోన్లలో మరిన్ని వెసులుబాట్లు కల్పించే ప్రయత్నం చేస్తారు. విమానాలు, రైళ్లు, ఆర్టీసీ బస్సులు వంటి ప్రజారవాణా వసతి మాత్రం ఇప్పుడే ప్రారంభించే పరిస్థితి లేదని భావిస్తున్నానని ఆయన చెప్పారు.

వలస వచ్చినవారు చిక్కుకుపోయిన రాష్ట్ర ప్రభుత్వాలు మరియు వారి స్వదేశీ ప్రభుత్వాలు వారిని తిరిగి పంపించే ముందు చర్చలు జరపాలి మరియు బస్సులకు కూడా ఏర్పాట్లు చేయాలి “అని రెడ్డి అన్నారు.

“విద్యార్ధులు మరియు వలస కూలీలందరూ ఎక్కడ ఉన్నా అక్కడే ఉండాలని నేను అభ్యర్థిస్తున్నాను. వీధుల్లోకి వెళ్లవద్దు, వారిని తిరిగి తీసుకురావడానికి కేంద్రం ఇప్పటికే కృషి చేస్తోంది. కొంత ఓపిక కలిగి ఉండండి, ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. మీరు ఇంతకాలం వేచి ఉన్నారు కాబట్టి మరికొన్ని రోజులు ఓపికపట్టండి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాలతో సహకరించండి “అని ఆయన అన్నారు.