https://oktelugu.com/

చిరంజీవి రాజకీయాలపై తమ్ముడి షాకింగ్ కామెంట్

కరోనా ఎఫెక్ట్ తో సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో తమ అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. మెగా బ్రదర్ నాగబాబు యూట్యూబ్లో ‘అంతా నా ఇష్టం’ అనే ఛానల్ ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. తాజాగా లాక్డౌన్ సమయంలో జనసేన సైనికులు, మెగా ఫ్యాన్స్ సందేహాలను తీర్చేందుకు ‘మన ప్రయాణం’ అనే కాన్సప్ట్ ను ఆయన ప్రారంభించారు. మెగా అభిమానులు, నెటిజన్లు వీడియో మేసేజ్ ద్వారా ప్రశ్నలు అడిగితే వాటికి నాగబాబు ఆ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 30, 2020 / 07:31 PM IST
    Follow us on


    కరోనా ఎఫెక్ట్ తో సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో తమ అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. మెగా బ్రదర్ నాగబాబు యూట్యూబ్లో ‘అంతా నా ఇష్టం’ అనే ఛానల్ ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. తాజాగా లాక్డౌన్ సమయంలో జనసేన సైనికులు, మెగా ఫ్యాన్స్ సందేహాలను తీర్చేందుకు ‘మన ప్రయాణం’ అనే కాన్సప్ట్ ను ఆయన ప్రారంభించారు. మెగా అభిమానులు, నెటిజన్లు వీడియో మేసేజ్ ద్వారా ప్రశ్నలు అడిగితే వాటికి నాగబాబు ఆ తర్వాత తన ఛానల్లో ఆ ప్రశ్న అడిగినవారిని చూపించి సమాధానం చెప్పనున్నారు. ఈ కార్యక్రమంలో ఓ నెటిజన్ చిరంజీవి జనసేనలోకి వస్తే చూడాలని ఉంది.. అలాంటి అవకాశం ఉందా? అని ప్రశ్నించారు. దీనిపై నాగబాబు తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

    కరోనా మరణాలను మించిపోనున్న ఆకలి మరణాలు!

    అన్నయ్య చిరంజీవిగారు ప్రజలకు సేవ చేయాలనే ‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించారని తెలిపారు. అనేక కారణాలతో ఆపార్టీని కొనసాగించలేక కాంగ్రెస్‌లో విలీనం చేశారని తెలిపారు. ఆ తర్వాత టూరిజం మంత్రిగా చేసినా.. ఆయనకు ఎక్కడో ఇండస్ట్రీకి దూరం అయ్యానే అనే బాధ.. తాజా పొలిటికల్ సిస్టమ్ నచ్చకపోవడంతోనే తిరిగి కళారంగానికి వెళ్లారని చెప్పారు. ఒకసారి రాజకీయాలు వద్దని వెళ్లిపోయాక తిరిగి మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే చేయరని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఆయన సినిమాల్లో మెగాస్టార్ గానే కొనసాగుతారని ఆయన అన్నారు.

    జగన్ పై జేడీ ప్రశంసలు!

    ఇక అన్నయ్య చిరంజీవి జనసేనలోకి వస్తారా? అని కొందరు పదేపదే అడుగుతున్నారని చెప్పారు. నిజానికి జనసేన మంచి ఐడియాలజీ ఉన్న పార్టీ. తమ్ముడు పవన్ కల్యాణ్ పెట్టిన స్థాపించిన పార్టీ. ఇందులో తాను కూడా యాక్టివ్‌గానే ఉన్నానని చెప్పారు. రాజకీయాలు వద్దనుకొని సినిమాల్లోకి వెళ్లిపోయాక చిరంజీవిగారు జనసేనలోకి వచ్చే అవకాశం లేదని చెప్పారు. మళ్లీ ఆయన రాజకీయాల్లోకి రారనేది తన నమ్మకం. అయితే భవిష్యత్ ఎలా ముందే ఊహించలేమని చెప్పారు. తనవరకైతే ఆయన రాడనే అనుకుంటున్నానని స్పష్టం చేశారు. ఒకవేళ చిరంజీవిగారు జనసేనలోకి రావాలనుకుంటే రావొచ్చని.. లేదంటే మరేవిధంగా సేవ చేయచ్చని నాగబాబు తెలిపారు. ప్రస్తుతం నాగబాబు వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.