https://oktelugu.com/

రఘురామ కేసు అందరికీ తెలిసేలా వ్యూహం?

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు బెయిల్ ఇచ్చే సమయంలో కేసు గురించి బయట మాట్లాడొద్దని నిబంధన విధించింది. దీంతో ఆయన కూడా ఎక్కడా మాట్లాడలేదు. కానీ చర్చ మాత్రం అందరికీ తెలిసేలా చేస్తున్నారు. దీంతో మీడియాలో వైరల్ అవుతున్నారు. సుప్రీం కోర్టు షరతులను పాటిస్తూనే తాను అనుకున్నది సాధించుకుంటున్నారు. తన గురించి ప్రచారం చేసుకోవడంలో తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తనపై సీఐడీ పోీసులు ప్రయోగించిన థర్డ్ డిగ్రీని తేలికగా తీసుకోవడం […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 7, 2021 1:06 pm
    Follow us on

    నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు బెయిల్ ఇచ్చే సమయంలో కేసు గురించి బయట మాట్లాడొద్దని నిబంధన విధించింది. దీంతో ఆయన కూడా ఎక్కడా మాట్లాడలేదు. కానీ చర్చ మాత్రం అందరికీ తెలిసేలా చేస్తున్నారు. దీంతో మీడియాలో వైరల్ అవుతున్నారు. సుప్రీం కోర్టు షరతులను పాటిస్తూనే తాను అనుకున్నది సాధించుకుంటున్నారు. తన గురించి ప్రచారం చేసుకోవడంలో తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు.

    నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తనపై సీఐడీ పోీసులు ప్రయోగించిన థర్డ్ డిగ్రీని తేలికగా తీసుకోవడం లేదు. కొట్టినా ఆయన చెప్పుకోలేదని కొట్టారేమో కానీ ఆయన మాత్రం చెప్పుకోవడానికి ఏ మాత్రం సంశయించడం లేదు. దేశంలో ప్రతి వ్యవస్థకు విపులంగా సీఐడీ పోలీసులు తనను ఎలా కొట్టారో వివరిస్తూ లేఖలు రాస్తున్నారు. ఇప్పటికే రాష్ర్టపతి సహా మానవహక్కుల సంఘం వరకు ఫిర్యాదు చేసిన ఆయన ఇప్పుడు పార్టమెంట్ లో ప్రతి ఎంపీకి తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారు.

    రఘురామ లేఖలు చదివిన తక్షణమే ఎంపీలు స్పందిస్తున్నారు. పార్టీలకతీతంగా ఎంపీపై జరిగిన దారుణాన్ని ఖండిస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధిపై జరిగిన తీరుకు సిగ్గుపడుతున్నామని ట్వీట్ చేస్తున్నారు. ఒక పార్లమెంటేరియన్ పట్ల ఏపీ ప్రభుత్వ దాడి ఘటనపై ప్రశ్నిస్తున్నారు. హిట్లర్ రాజ్యమా? ప్రజారాజ్యమా ? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంపీని గాయపర్చడం వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందని నిరసన వ్యక్తం చేశారు.

    రఘురామ వ్యూహమేమిటంటే తన కేసు వీలైనంత కాలం ప్రజల్లో నానేలా చేయడమే. దానికి ఏపీ సర్కారు వచ్చిన వ్యూహాలను చిత్తు చేస్తూ ముందుకు వెళుతున్నారు. పార్లమెంట్ లో ఎంపీలంతా తనకు మద్దతిచ్చేలా చూసుకుంటున్నారు. పార్లమెంట్ లో మాట్లాడడానికి రఘురామకు పర్మిషన్ వస్తే ఆయన ఏపీ సర్కారుపై మరింత ఘాటుగా విరుచుకుపడే అవకాశం ఉంది.