https://oktelugu.com/

ఉభయభాషల యాక్షన్ కోసం దిల్ రాజు ఉబలాట !

గతేడాది నిర్మాత దిల్ రాజు ఓ క్రేజీ కాంబినేషన్ కోసం తెగ ప్రయత్నించాడు. తెలుగు యాక్షన్ డైరక్టర్ బోయపాటిని తమిళ యాక్షన్ సూపర్ స్టార్ సూర్యతో కలిపి ఒక యాక్షన్ సినిమా చేయాలని తెగ ఉబలాట పడ్డాడు. ఓ దశలో సూర్య కూడా ఓకే చెప్పాడు. ఎలాగూ బోయపాటి రెడీగా ఉంటాడు. సో.. సినిమా ఫిక్స్ అనుకున్నారు. బాలయ్యతో అఖండ తరువాత ఈ సినిమా ఉంటుందని అనుకున్నారు. మొత్తమ్మీద ఓ ఉభయభాషల సినిమా చేసి, రెండు భాషల […]

Written By:
  • admin
  • , Updated On : June 7, 2021 / 01:28 PM IST
    Follow us on

    గతేడాది నిర్మాత దిల్ రాజు ఓ క్రేజీ కాంబినేషన్ కోసం తెగ ప్రయత్నించాడు. తెలుగు యాక్షన్ డైరక్టర్ బోయపాటిని తమిళ యాక్షన్ సూపర్ స్టార్ సూర్యతో కలిపి ఒక యాక్షన్ సినిమా చేయాలని తెగ ఉబలాట పడ్డాడు. ఓ దశలో సూర్య కూడా ఓకే చెప్పాడు. ఎలాగూ బోయపాటి రెడీగా ఉంటాడు. సో.. సినిమా ఫిక్స్ అనుకున్నారు. బాలయ్యతో అఖండ తరువాత ఈ సినిమా ఉంటుందని అనుకున్నారు.

    మొత్తమ్మీద ఓ ఉభయభాషల సినిమా చేసి, రెండు భాషల మార్కెట్ ను క్యాష్ చేసుకోవాలని దిల్ రాజు ప్లాన్ చేశాడు. కానీ, ఆ తరువాత ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేకుండా పోయింది. అయితే, ఈ సినిమా పై మళ్ళీ ఎలాంటి పురోగతి లేకపోవడానికి ప్రధాన కారణం బోయపాటి రెడీ చేసిన కథ సూర్యకు నచ్చలేదు.

    గతంలో ప్రభాస్ కోసం బోయపాటి ఒక బలమైన ఎమోషనల్ యాక్షన్ కథ తయారుచేసాడట. ఆ కథనే అటు ఇటుగా మార్చి సూర్యకి వినిపించాడు. కానీ కథ సూర్యకి కనెక్ట్ కాలేదు. దాంతో ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ నుండి అందుతున్న అప్ డేట్ ప్రకారం రచయిత వక్కంతం వంశీ ఓ కథ రాసాడట. వంశీ కథ దిల్ రాజుకి బాగా నచ్చింది.

    ఈ కథే సూర్యకి కూడా నచ్చితే, బోయపాటి కథను పక్కన పెట్టి, ఈ కథను సూర్యతో చేయించాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. ఎలాగూ సూర్య కూడా ఎప్పటినుంచో తెలుగులో ఓ డైరెక్ట్ మూవీ చేయాలని అనుకుంటున్నాడు. వంశీ సబ్జెక్ట్ కాబట్టి విషయం ఉంటుంది, అలాగే దిల్ రాజు నిర్మాత కాబట్టి, లాంచింగ్ గ్రాండ్ గా ఉంటుంది. సో.. దిల్ రాజు ప్రపోజల్ ను సూర్య ఈజీగా ఒప్పుకునే అవకాశం ఉంది.