https://oktelugu.com/

Cartoonist Sridhar: ఈనాడు నుంచి కార్టూనిస్ట్ శ్రీధర్ ఎగ్జిట్ వెనుక కథేంటి?

Cartoonist Sridhar : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 40 ఏళ్లు.. ఒకే సంస్థలో పని.. ఇంత నిబద్ధత గల కార్టూనిస్ట్ (Cartoonist) ను ఎక్కడా? ఎప్పుడూ చూడలేదన్న టాక్ జర్నలిస్ట్ వర్గాల్లో ఉంది. సాక్షి మీడియా వచ్చినప్పుడు కూడా ఆయన ఆ ఆఫర్ కు టెంప్ట్ కాలేదు.. ఈనాడును వదిలి పోలేదు.. అతడు ఎవరో కాదు.. ఈనాడులో 40 ఏళ్లుగా కొనసాగుతూ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన దిగ్గజ కార్టూనిస్ట్ శ్రీధర్( Sridhar). తాజాగా ఆయన […]

Written By:
  • NARESH
  • , Updated On : August 31, 2021 / 11:52 AM IST
    Follow us on

    Cartoonist Sridhar : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 40 ఏళ్లు.. ఒకే సంస్థలో పని.. ఇంత నిబద్ధత గల కార్టూనిస్ట్ (Cartoonist) ను ఎక్కడా? ఎప్పుడూ చూడలేదన్న టాక్ జర్నలిస్ట్ వర్గాల్లో ఉంది. సాక్షి మీడియా వచ్చినప్పుడు కూడా ఆయన ఆ ఆఫర్ కు టెంప్ట్ కాలేదు.. ఈనాడును వదిలి పోలేదు.. అతడు ఎవరో కాదు.. ఈనాడులో 40 ఏళ్లుగా కొనసాగుతూ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన దిగ్గజ కార్టూనిస్ట్ శ్రీధర్( Sridhar). తాజాగా ఆయన ఉన్న ఫళంగా ఆ సంస్థకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం జర్నలిస్ట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆయన ఎందుకు రాజీనామా చేశాడు.? అసలేంటి కథ అనేది ఆసక్తి రేపుంది.

    ఈనాడు పత్రిక (Eenadu Paper) ప్రస్థానం.. ఎదుగుదలలో కార్టూనిస్ట్ శ్రీధర్ పాత్ర ఎంతో ఉంది. ఆయన కార్టూన్ లు రాజకీయాలను శాసించాయి. షేక్ చేశాయి. జాతీయ రాజకీయాల్లోనూ సంచలనం సృష్టించాయి. శ్రీధర్ కార్టూన్ ల కోసమే పేపర్ వేయించుకునే వారున్నారంటే అతిశయోక్తి కాదు.. కానీ ఇప్పుడు ఆయన వైదొలిగాడు.. ఎందుకు వైదొలిగాడన్నది అందరూ ఆరాతీస్తున్నారు.శ్రీధర్ కార్టూన్ లేని ఈనాడును ఊహించుకోలేం అని అంటున్నారు.

    తనకు ఎన్ని ఆఫర్లు వచ్చినా.. జాతీయ పేపర్లు సైతం పిలిచినా వెళ్లకుండా 40 ఏళ్లుగా శ్రీధర్ ఈనాడును అట్టిపెట్టుకునే ఉన్నాడు. కృతజ్ఞత చూపాడు. ఈనాడుసంస్థ కూడా ఈ దిగ్గజ కార్టూనిస్ట్ కు అందలం ఎక్కించింది. సంస్థలోనే అత్యధిక జీతం ఇచ్చి అట్టిపెట్టుకుంది. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు సైతం కార్టూనిస్ట్ శ్రీధర్ కు ఎంతో గౌరవం ఇచ్చి మూలస్థంభంగా భావించాడు. అయితే ఇంత ప్రాధాన్యం ఇచ్చిన కార్టూనిస్ట్ శ్రీధర్ ను ఈనాడు సంస్థ ఎందుకు వదలుకున్నదనేది ఆశ్చర్యం వేస్తోంది.

    40 ఏళ్లుగా పనిచేస్తున్నప్పుడు ఎవరికైనా అసంతృప్తి, అలకలు, బుజ్జగింపులు ఉంటాయి. అయితే శ్రీధర్ విషయంలో మాత్రం ఈనాడు ఎంతో ఉదారంగా వ్యవహరించిందన్నది ఆ ఉద్యోగులే చెబుతుంటారు. అలాంటిది సడెన్ గా ఎందుకు ఇలా వదులుకుందన్నది హాట్ టాపిక్.

    అయితే కరోనా కల్లోలం.. పత్రికల పతనం.. జీతాల సమస్య,.. నిర్వహణ భారం కారణంగానే పెద్ద తలకాయలందరినీ ఈనాడు వదిలేసుకుంది. వ్యక్తుల కంటే వ్యవస్థ గొప్పది అని ఈ మధ్య కరోనా వేళ వందలమంది ఉద్యోగులను తొలగించిందన్నది వారే చెబుతారు. మునుపటిలా పత్రికలకు ఆదరణ లేకపోవడం.. ఆదాయం పడిపోవడం కూడా ఈ భారీ జీతాలున్నవారిని పంపడానికి కారణంగా చెబుతున్నారు.

    ఇక ఈనాడులో పనిచేసే ఏ ఉద్యోగికైనా ఇతర వ్యాపకాలు ఉండకూడదన్నది నిబంధన. బయట అవార్డులు, రివార్డులు తీసుకోకూడదు. ఉంటే తొలగిస్తారు.. అది నిషేధం. శ్రీధర్ నిష్క్రమణకు ఇదీ ఒక కారణంగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

    40 ఏళ్లు ఈనాడులో పూర్తి చేసుకున్న సందర్భంగా కార్టూనిస్ట్ శ్రీధర్ ఇటీవల ఓ వేడుక నిర్వహించుకున్నాడట.. సంస్థ ఆ పనిచేయకున్నా.. ఇంటి కుటుంబ సభ్యులు… సన్నిహితులు ఈ పార్టీ చేశారట.. ఈ సందర్భంగా శ్రీధర్ ఒక కారు కొనుక్కున్నాడని తెలిసింది. అయితే అది ఎవరో బహుమతిగా ఇచ్చారన్న ప్రచారం జోరుగా జరిగింది. దీనిపై యాజమాన్యానికి తెలియడం.. సీరియస్ కావడం జరిగింది.. దీంతో మనస్థాపం చెందిన శ్రీధర్ ఈనాడు సంస్థకు రాజీనామా చేసినట్టు జర్నలిస్ట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

    అయితే ఇదంతా నిజమా? ప్రచారమా? అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై ఇటు శ్రీధర్ కానీ.. అటు ఈనాడు యాజమాన్యం కానీ స్పందించలేదు. కారణాలు వెల్లడించలేదు. కానీ దిగ్గజ కార్టూనిస్ట్ శ్రీధర్ నిష్క్రమణతో ఇక ఈనాడులో ఎవరికి ఉద్యోగ భద్రత లేదన్న వాస్తవం మాత్రం అందరికీ తెలిసివచ్చింది. ఈ మీడియా జీవితాలే అంత.. ప్రత్యామ్మాయం లేకుంటే జర్నలిస్టుల బతుకులు ఎంత దుర్బరంగా తయారవుతాయో తాజా ఘటన ఒక ఉదాహరణ అని చెప్పుకుంటారు.