
ఆఫ్ఘనిస్థాన్ ఆక్రమణలో ఓటమి పాలైన అమెరికాకు ఇదో పెద్ద గుణపాఠమని, భవిష్యత్తు తరాలకు కూడా ఆక్రమణదారులకు ఇదో లెసన్ గా మిగులుతుందని జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. ఆర్మీ దుస్తులు ధరించి ఆయుధాలతో ఉన్న ఫైటర్లను ఉద్దేశిస్తూ కాబూల్ విమానాశ్రయంలో బజీహుల్లా మాట్లాడారు. వారి త్యాగాలను ప్రశంసిస్తూ వారికి థ్యాంక్స్ చెప్పారు. మళ్లీ మన దేశాన్ని ఎవరూ ఆక్రమించరని భావిస్తున్నానని తెలిపారు. శాంతి, సామరస్యంతో పాటు నిజమైన ఇస్లామిక్ వ్యవస్థ ఏర్పాటు కావాలన్నారు.