AP Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణపై ఇంకా సందేహాలేనా?

AP Cabinet Expansion: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణపై ఇంకా అనుమానాలు తొలగిపోలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసి మూడేళ్లవుతున్నా సీఎం మాత్రం స్పందించడం లేదు. రాజకీయంగా వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే మంత్రివర్గ విస్తరణపై భయాందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణపై ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. దీంతో ఆశావహుల్లో ఇంకా ఆశలు పెరిగిపోతున్నాయి. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడో అని ఎదురుచూస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పుడే తరువాత మంత్రివర్గ విస్తరణ చేస్తామని చెప్పినా ఆ దిశగా అడుగులు వేయడం […]

Written By: Srinivas, Updated On : November 27, 2021 3:22 pm
Follow us on

AP Cabinet Expansion: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణపై ఇంకా అనుమానాలు తొలగిపోలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసి మూడేళ్లవుతున్నా సీఎం మాత్రం స్పందించడం లేదు. రాజకీయంగా వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే మంత్రివర్గ విస్తరణపై భయాందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణపై ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. దీంతో ఆశావహుల్లో ఇంకా ఆశలు పెరిగిపోతున్నాయి. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడో అని ఎదురుచూస్తున్నారు.

AP Cabinet Expansion

జగన్ అధికారంలోకి వచ్చినప్పుడే తరువాత మంత్రివర్గ విస్తరణ చేస్తామని చెప్పినా ఆ దిశగా అడుగులు వేయడం లేదు. కొద్ది కాలంగా మంత్రివర్గ విస్తరణ చేపడతారని ఊహాగానాలు వినిపిస్తున్నా జగన్ మాత్రం స్పందించడం లేదు. ఇన్నాళ్లు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న ఆశలు అడియాశలే అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ మదిలో ఏముందో తెలియడం లేదు.

అయితే తొంభై శాతం మందిని మారుస్తారనే వాదన బలంగా వినిపిస్తున్నా అసలు విస్తరణపై కూడా ఇంకా పీటముడి వీడటం లేదు. రెండున్నరేళ్లు పూర్తయినా మంత్రివర్గ విస్తరణపై మల్లగుల్లాలు పడుతున్నారు. కొత్తవారికి అవకాశం కల్పిస్తారని ఎదురు చూస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు.

Also Read: BJP leader Tarun Chugh comments : తెలంగాణలో రాజకీయ కాక.. బీజేపీతో టచ్ లో ఉన్న ఆ పాతిక మంది ఎవరు?

మరోవైపు పాతవారినే 70 శాతం మందిని కొనసాగిస్తారనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. దీంతో మంత్రివర్గ విస్తరణపై ఇంకా అనుమానాలు వీడటం లేదు. ఎప్పుడు చేపడతారో కూడా స్పష్టమైన సంకేతాలు సైతం వెలువడటం లేదు. దీంతో ఏపీ వైసీపీ నేతల్లో ఇంకా సందిగ్దత తొలగడం లేదు. ఎవరికి ఉద్వాసవన పలుకుతారో తెలియడం లేదు.

Also Read: Jagan Mohan Reddy’s Big Blunder: సీఎం జగన్ పెద్ద తప్పు చేశాడా?

Tags