Twitter: ఆయనకు ట్విట్టర్ ఖాతాలేదు.. అడ్డంగా బుక్కైన మంత్రి!

Twitter: కరోనా ఎంట్రీ ఇచ్చాక సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులన్నీ తలకిందులుగా మారాయి. దేశంలో కరోనా తగ్గముఖం పట్టడంతో అన్ని రంగాలు ఏదో ఒక విధంగా కోలుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే సినిమా ఇండస్ట్రీ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఎనిమిది నెలలు థియేటర్లు పడగా నిర్మాతలు షూటింగులు సైతం నిలిచివేశారు. అయితే లాక్డౌన్ క్రమంగా ఎత్తివేయడంతో కరోనా నిబంధనలు పాటిస్తూ మళ్లీ షూటింగులు ప్రారంభమయ్యాయి. కరోనా సమయంలో చిన్న సినిమాలను ఓటీటీలు కొంతమేర […]

Written By: NARESH, Updated On : November 27, 2021 3:41 pm
Follow us on

Twitter: కరోనా ఎంట్రీ ఇచ్చాక సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులన్నీ తలకిందులుగా మారాయి. దేశంలో కరోనా తగ్గముఖం పట్టడంతో అన్ని రంగాలు ఏదో ఒక విధంగా కోలుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే సినిమా ఇండస్ట్రీ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఎనిమిది నెలలు థియేటర్లు పడగా నిర్మాతలు షూటింగులు సైతం నిలిచివేశారు. అయితే లాక్డౌన్ క్రమంగా ఎత్తివేయడంతో కరోనా నిబంధనలు పాటిస్తూ మళ్లీ షూటింగులు ప్రారంభమయ్యాయి.

minister

కరోనా సమయంలో చిన్న సినిమాలను ఓటీటీలు కొంతమేర ఆదుకున్నాయి. అయితే పెద్ద సినిమాలు మాత్రం ఓటీటీలు భారీ మొత్తం చెల్లించలేక పోతున్నాయి. దీంతో వీరంతా థియేటర్లపైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే కరోనా సమయంలో ఓటీటీలకు అలవాటు పడిన సినీప్రియులు థియేటర్లకు వచ్చేందుకు జంకుతున్నాయి. కరోనా ఆంక్షల మధ్య సినిమా చూడటానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈక్రమంలోనే పెద్ద సినిమాలకు టికెట్ల రేట్లు పెంచాలనే డిమాండ్ బడా నిర్మాతల నుంచి వస్తోంది.

తెలంగాణలో సినిమా ఇండస్ట్రీకి అన్నిరకాలుగా సహకారం లభిస్తోంది. మొదటి వారంలో టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షోస్, తదితర సౌకర్యాలను కల్పిస్తోంది. కానీ ఏపీ సర్కారు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. టికెట్ల రేట్లు పెంచితే ప్రజలపై భారం పడుతుందనే నెపంతో టికెట్ల పెంపునకు మొకాలడ్డుతోంది. ఇదే సమయంలో సినిమా ఇండస్ట్రీకి ఇబ్బందులు కలిగే కొత్త కొత్త జీవోలను తీసుకొస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

ఈక్రమంలోనే జగన్ సర్కార్ వర్సెస్ టాలీవుడ్ ఇండస్ట్రీ అనేలా పరిస్థితులు మారిపోయాయి. దీంతో ఇండస్ట్రీలోని కొంతమంది జగన్ సర్కారు మద్దతు పలుకుతుండగా మెజార్టీ మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో ఇండస్ట్రీని పలువురు పెద్దలు సీఎం జగన్మోహన్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. చాలారోజులుగా టికెట్ల పెంపు అంశంపై ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చిస్తుంది. దీనిపై త్వరలోనే నిర్ణయం ప్రకటించనున్నట్లు పేర్ని నాని ప్రకటించారు.
Also Read: మంత్రివర్గ విస్తరణపై ఇంకా సందేహాలేనా?

ఇటీవల చిరంజీవి సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. అదేవిధంగా పలువురు ఇండస్ట్రీలోని ప్రముఖులు సైతం సినిమా సమస్యలపై జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ చిరంజీవి, దర్శకుడు తివిక్రమ్ ట్వీట్లను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. అయితే తివిక్రమ్ కు సోషల్ మీడియాలో ఎలాంటి అధికారిక ఖాతా లేదు. అయితే మంత్రికి ఈ విషయం తెలియకపోవడంతో అదే విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

దీనిపై ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ స్పందించింది. దర్శకుడు త్రివిక్రమ్ కు ట్వీటర్లో ఎలాంటి అధికారిక ఖాతాలు లేవని వెల్లడించారు. ఆయన ఏ విషయం చెప్పాలనుకున్నా కూడా హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఫార్చ్యూన్ 4 మూవీస్ కు సంబంధించిన అధికారిక ట్వీటర్ ద్వారానే వస్తాయని తెలిపింది. ఆయన పేరు, ఖాతాలతో ఉన్న ఎలాంటి ప్రకటనలను నమ్మవద్దని ఏపీ సీఎంవో, మంత్రి పేర్ని నాని ట్వీటర్ ఖాతాలను ట్యాగ్ చేసింది. దీంతో పేర్ని నాని త్రివిక్రమ్ విషయంలో అడ్డంగా బుక్కై నాలుక కరుచుకోవాల్సి వచ్చింది.

Also Read: సీఎం జగన్ పెద్ద తప్పు చేశాడా?