Prashant Kishore: ఆంద్రప్రదేశ్ లో రాజకీయ వేడి అప్పడే మొదలైంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయమున్నా అధికార పార్టీ వైసీపీ తన ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా గతంలోనే జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ ఈ మేరకు ప్రకటన చేశారు. మంత్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ర్ట వ్యాష్ర్టవ్యాప్తంగా సర్వేలు నిర్వహిస్తున్నారని వాటి నివేదికల ఆధారంగానే టికెట్లు ఇస్తామని చెప్పారు. దీంతో నేతల్లో అంతర్మథనం మొదలైంది.

రాష్ర్టంలోని 175 నియోజకవర్గాల్లో తొలి దఫ సర్వే కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు అమలు చేసేందుకు సిద్ధమయ్యారు.గతంలో కూడా పీకీ సూచనల మేరకే జగన్ కు అధికారం దక్కిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అధికారానికి దూరమైనట్లు తెలిసిందే. దీంతో సామాజిక మాధ్యమాల ద్వారా కుల, మత వర్గాల మధ్య చిచ్చు పెట్టి చంద్రబాబుకు సీఎం కుర్చీ దూరం చేసినట్లు చెబుతున్నారు.
Also Read: యూపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న కేటీఆర్.. అఖిలేశ్‌కు మద్దతుగా ప్రచారం..?
ఈ నేపథ్యంలోనే చిరంజీవికి రాజ్యసభ సభ్యుడి పదవి ఇస్తారనే ప్రచారానికి తెర లేపారు. కానీ ఆయన తనకు ఆ పదవులపై ఆసక్తి లేదని చెప్పడంతో దానికి ఫుల్ స్టాప్ పడింది. ఈ తరహా ఊహాగానాలు రేపుతూ అందరిని ఆలోచనలో పడేయడమే పీకే వ్యూహంగా చెబుతున్నారు. మొత్తానికి రాష్ర్టంలో రాజకీయ వేడి ప్రారంభమైందనే తెలుస్తోంది. చిరంజీవి విషయం ప్రసార మాధ్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
అయితే గత ఎన్నికల్లో పీకీ వ్యూహాలను లెక్కచేయకపోవడంతోనే బాబుకు తిప్పలు వచ్చాయి. కానీ ఈసారి మాత్రం పీకే ప్లాన్ లను తిప్పికొట్టేందుకు బాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పీకే రాకముందే అతడిపై బరద జల్లేందుకు బాబు తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది. పీకే కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడంలో దిట్ట అని ప్రచారం చేస్తున్నారు. దీంతో పీకే పథకాలు ఇక్కడ పనిచేయకుండా చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా రాష్ర్టంలో అధికారం కోసం నువ్వా నేనా అనే రీతిలోనే యుద్ధం కొనసాగుతుందని తెలుస్తోంది.
Also Read: పల్నాడులో పావులుగా మారుతున్న పోలీసులు.. రాజకీయ రచ్చ..