Homeజాతీయ వార్తలుSSC Hindi Paper Leak: పది" హిందీ పేపర్ లీక్ : వరుస పేపర్ లీకులకు...

SSC Hindi Paper Leak: పది” హిందీ పేపర్ లీక్ : వరుస పేపర్ లీకులకు కారణమేంటి? ఎవరు చేస్తున్నారు

SSC Hindi Paper Leak
SSC Hindi Paper Leak

SSC Hindi Paper Leak: టీఎస్ పీఎస్సీ ఏఈ ప్రశ్న పత్రం లీక్, గ్రూప్_1 ప్రిలిమ్స్ ప్రశ్న పత్రం, పదో తరగతి తెలుగు పేపర్ లీక్, ఇవాళ హిందీ ప్రశ్న పత్రం… ఇంకా మును ముందు ఎలాంటి లీకు వార్తలు వినాల్సి వస్తుందో.. బాధ్యతగల ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో తనకు సంబంధం లేదు అంటున్నది. ఇప్పుడు పదో తరగతి ప్రశ్నపత్రల లీక్ తో కూడా తనకు సంబంధం లేదు అని చెబుతుందా? ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరీక్షలకు ఏర్పాట్లు మొదలు, సవ్యంగా నిర్వహించేదాకా అనేక జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇన్విజిలేటర్లు, పరీక్షల అధికారులు పరీక్ష హాల్లోకి సెల్ ఫోన్ లను తీసుకెళ్లకూడదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్ష కేంద్రాల్లోకి అధికారులు దర్జాగా మొబైల్ ఫోన్ లు దర్జాగా తీసుకెళ్లారు. తాండూరులో వాట్సప్ లో ప్రశ్నపత్రాన్ని పంపడం కూడా ఈ కోవలోనిదే. లక్షల పట్ల ఉన్నతాధికారి ముందు నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు గతంలోని ఆరోపణలు చేశాయి. కానీ పట్టించుకున్న వారు లేరు. విద్యాశాఖ మంత్రి సొంత జిల్లాలోని ఇలా జరుగుతుంటే.. మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రతి పరీక్ష కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అధికారులు ప్రకటించారు. కానీ సెల్ ఫోన్ తీసుకెళుతున్న విషయాన్ని మాత్రం పసిగట్టలేకపోతున్నారు.. అంతేకాదు ఉన్నతాధికారులు పరీక్షల నిర్వహణ, పాఠశాలలు, ఉపాధ్యాయుల పని విధానం వంటి అంశాల పర్యవేక్షణలో తీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.. అంతేకాదు తాండూరులో ప్రశ్న పత్రం లీక్ అయిన ఘటనలో ఉన్నతాధికారి పేరు స్పష్టంగా బయటికి వినిపిస్తోంది. కానీ ప్రభుత్వం ఇంతవరకు అతడి పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సదరు అధికారికి భారత రాష్ట్ర సమితిలో ఓ కీలకమైన నాయకుడితో బంధుత్వం ఉంది. దీనిని ఆసరాగా తీసుకొని అతడు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. కనీసం తోటి ఉపాధ్యాయుల సమస్యలు వినే తీరిక కూడా అతడికి లేదు. పైగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న అనేక అవకతవకలను తొక్కి పెడుతున్నాడు. పైగా తనకున్న అధికారంతో ప్రైవేటు పాఠశాలలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడని వినికిడి.

SSC Hindi Paper Leak
SSC Hindi Paper Leak

తాండూరులో తొలుత పదో తరగతికి 11 పేపర్లతో పరీక్షలు ఉంటాయని చెప్పారు..దీంతో ఎస్ఏ _1, 2 పరీక్షలకు ప్రధానోపాధ్యాయులు ఆమెకు ప్రశ్న పత్రాల ప్రింటింగ్ కు ఆర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత అధికారులు 6 పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తామంటూ చెప్పారు.. దీంతో 11 ప్రశ్న పత్రాలను ముద్రించిన టీచర్లు పరీక్షల నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సదరు అధికార నిర్వాకం వల్ల కొన్నిచోట్ల 11 పేపర్లతో, మరి కొన్నిచోట్ల 6 పేపర్లతో పరీక్షలను నిర్వహించాల్సిన ఖర్మ నెలకొంటున్నదని ఉపాధ్యాయులు అంటున్నారు.

వాస్తవానికి భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా శాఖలో రాజకీయ ప్రాబల్యం పెరిగిపోయింది. ఓ మంత్రి విద్యాశాఖను చూసినప్పుడు తన సొంత కులం వారికే కీలక పోస్టులు కట్టబెట్టారని ప్రచారం జరుగుతున్నది. ఆయన అండ చూసుకొని ఆ అధికారులు రెచ్చిపోతున్నారని సమాచారం.. అయితే వారిపై ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఇక నిన్న తాండూరులో తెలుగు ప్రశ్న పత్రం లీక్ అయిన నేపథ్యంలో.. మంగళవారం వరంగల్ లో పదవ తరగతి హింది ప్రశ్న పత్రం లీక్ అయినట్టు వార్తలు వచ్చాయి. ఆ ప్రశ్న పత్రం వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. దీనిని ఎవరు చేశారనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక తాండూరులో పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీక్ అయిన ఘటన లో బందప్ప, సమ్మప్ప అనే ఉపాధ్యాయులను అరెస్టు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular