Minister Srinivas Goud: తెలంగాణలో రాజకీయాలు మారుతున్నాయి. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు బీజేపీ నేతలు కుట్ర పన్నారనే విషయం బయటకు రావడంతో బీజేనీ నేతలు కంగారు పడుతున్నారు. ఇదేమిటని నోరు వెళ్లబెడుతున్నారు. మేమేంటి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నడమేమిటని ప్రశ్నిస్తున్నారు ,.ఇదంతా ప్రభుత్వ కుట్రలో భాగమేనని చెబుతున్నారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా అధిష్టానానికి నివేదిక పంపారు.
రాజకీయ కుట్రలో భాగంగానే జితేందర్ రెడ్డి, డీకే అరుణపై హత్య కేసు బనాయించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని దుయ్యబడుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత బీజేపీని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ నేతలపై హత్య కేసు బనాయించి పార్టీ ప్రతిష్టను దెబ్బతీయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకే హత్య కేసును బయటకు తీసుకువస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Also Read: మహిళల అభ్యున్నతికి కేసీఆర్ మరిన్ని పథకాలు తేనున్నారా?
మరోవైపు సంజయ్ సహా నేతలందరు ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి వివరించనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ కావాలనే కుట్రలో భాగంగా తమపై కేసులు పెడుతోందని చెబుతున్నారు. దీంతో జితేందర్ రెడ్డి, డీకే అరుణ ప్రెస్ మీట్లు పెట్టి మరీ ప్రభుత్వ దురాగాతాన్ని ఆక్షేపించారు. తమపై అక్కసుతోనే కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని సూచిస్తున్నారు.
కావాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో కేసీఆర్ బీజేపీని అభాసుపాలు చేసే ఉద్దేశంతోనే ఇలాంటి చౌకబారు ఆరోపణలకు దిగుతూ బీజేపీ నేతలను భయపెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసమే కేసీఆర్ కపట నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త పీకేతో సమావేశమైన కేసీఆర్ వ్యూహాల్లో భాగంగానే ఇలాంటి తప్పుడు కేసులు పెడుతూ భయాందోళనలకు గురిచేయాలని చూస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో కేసీఆర్ కుట్రలు మొదలయ్యాయని చెబుతున్నారు.