TRS Dissent Leaders: తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ పార్టీనేతలు దిక్కులు చూస్తున్నారు. 2014, 2018 వరుసగా రెండుసార్లు టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడంతో విపక్ష నేతలంతా గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో కారులో లోడు పెరిగింది. ముఖ్యంగా టీఆర్‌ఎస్ టికెటపై పోటీచేసి ఓడిపోయిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన వారు కూడా తిరిగి గులాబీ గూటికి వచ్చారు. దీంతో దీంతో స్వపక్షంలోనే విపక్షం తయారైంది. ఇన్నాళ్లూ సర్దుకుపోతూ వచ్చిన నేతలు ఇక బయటపడే మార్గం వెతుకుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది కాంగ్రెస్‌వైపు చూస్తుండగా, మరికొందరు బీజేపీ వైపు చూస్తున్నారు.

జాతీయ పార్టీ పనిలో గులాబీ బాస్..
టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జాతీయ పార్టీ ఏర్పాటులో బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో పాలన మొత్తాన్ని తన తనయుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు అప్పగించారు. పార్టీని కూడా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో ముందస్తు ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న వారు, పీకే నివేదిక ప్రకారం తమకు టికెట రాదు అని నిర్ణయానికి వచ్చినవారు, వివిధ పార్టీల నుంచి గులాబీ కండువా కప్పుకుని, భవిష్యత్తు ఏమిటో తెలియక తికమక పడుతున్నవారు మూటముల్లె సర్దుకుంటున్నారు. పార్టీ మారేందుకు ఇదే సమయమని భావిస్తున్నారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ నేతలతో ఇప్పటికే సంప్రదింపులు షురూ చేశారు. ఈ క్రమంలోనే జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్, కాంగ్రెస్ నేత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు రెండు రోజుల క్రితం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్‌లో ప్రత్యక్షమయ్యారు. పార్టీ మార్పుపై గులాబీ నేతలకు ముందే విషయం తెలిసింది. దీంతో పార్టీ సీనియర్ నేతలు ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ టికెట్ ఆశిస్తున్న ఆమె టీఆర్‌ఎస్‌లో ఉంటే అది సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చారు. దీంతో సొంతగూటికి వెళ్లాలని ఫిక్స్ అయ్యారు. ఈనెల 23న కాంగ్రెస్‌లో చేరతానని ప్రకటించారు.
Also Read: Indians Funds in Swiss Banks: స్విస్ బ్యాంకులో నల్లధనం.. మనోళ్ల సంపద ట్రిపుల్!
గులాబీనేతల అలర్ట్..
ఇప్పటికే పార్టీలో అసంతృప్తు తలనొప్పిగా మారిన టీఆర్‌ఎస్ అధిష్టానం తాజా పరిణామంతో అలర్ట్ అయింది. ఇప్పటికే అసంతృప్తులను బుజ్జగించే పనిలో ఉన్న ముఖ్యమైన మంత్రి కేటీఆర్ ఇటీవల ఖమ్మం వెళ్లి.. అక్కడి అసంతృప్త నేతలు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డిని కలిశారు. రహస్యంగా చర్చలు జరిపారు. న్యాయం చేస్తామని, పార్టీ మారే ఆలోచన విరమించుకోవాలని కోరారు. తాజాగా నాగర్‌కర్నూల్ వెళ్లిన కేటీఆర్ కొల్హాపూర్ అసంతృప్త నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును బుజ్జగించే ప్రయత్నం చేశారు.

మునుపెన్నడూ కనిపించని దృశ్యాలు..
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీఆర్‌ఎస్ నేతలకు బెదిరించి పార్టీలోకి లాక్కోవడం, లేదా నచ్చనివారి పదవి లాక్కుని బయటకు పంపడం జరిగాయి. బుజ్జగించిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. కానీ, కొన్ని రోజులుగా బుజ్జగింపు దృశ్యాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇన్నాళ్లూ.. ఇష్టంలేని వాళ్లు పోతే పోతారు అన్నట్లుగా వ్యవహరించిన పార్టీ ఇప్పుడు మాత్రం పంథాను మార్చుకున్నట్లు సమాచారం. పార్టీలో ఏళ్లుగా పార్టీలో అవకాశాలు రాక, అధినేత సీఎం కేసీఆర్‌తీరుపై గుర్రుగా ఉన్న పలువురు నేతలను బుజ్జగించే బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తలకెత్తుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల హడావుడి, విపక్ష కాంగ్రెస్, బీజేపీ దూకుడు నేపథ్యంలో సీనియర్ నేతలు పార్టీని వీడకుండా ఉండేందుకు తన వంతుగా కేటీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నట్లు జరుగుతోన్న పరిణామాలను బట్టి అర్థమవుతోంది.
[…] Also Read: TRS Dissent Leaders: ‘చేతి’లో గులాబీలు.. టీఆర్‌ఎస్… […]