ఆడవారి కోసం ప్రత్యేకంగా విదేశీ మద్యం, వైన్ షాపులు

మధ్య ప్రదేశ్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా వైన్స్‌ షాపులు రానున్నాయి. ఆడవారికి ఇబ్బంది లేకుండా మందు కొనుక్కోవడానికి అక్కడి కమల్ నాథ్‌ ప్రభుత్వం ఈ కొత్త ఆలోచన చేసింది. తొలుత మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌, ఇండోర్‌లలో రెండేసి చొప్పున షాపులు.. జబల్ పూర్‌, గ్వాలియర్‌లలో ఒక్కో షాపును ప్రారంభింపనున్నారు. మహిళలు ఎక్కువగా ఇష్టపడే విస్కీ, వైన్‌ బ్రాండ్లనే అక్కడ అమ్మనున్నారు. అందులోనూ ఫారిన్ బ్రాండ్లనే అమ్మకానికి పెట్టనున్నారు. అంటే రాష్ట్రంలో రిజిస్టర్‌ కాని బ్రాండ్లను కూడా ఈ […]

Written By: Neelambaram, Updated On : February 28, 2020 11:23 am
Follow us on

మధ్య ప్రదేశ్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా వైన్స్‌ షాపులు రానున్నాయి. ఆడవారికి ఇబ్బంది లేకుండా మందు కొనుక్కోవడానికి అక్కడి కమల్ నాథ్‌ ప్రభుత్వం ఈ కొత్త ఆలోచన చేసింది.

తొలుత మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌, ఇండోర్‌లలో రెండేసి చొప్పున షాపులు.. జబల్ పూర్‌, గ్వాలియర్‌లలో ఒక్కో షాపును ప్రారంభింపనున్నారు. మహిళలు ఎక్కువగా ఇష్టపడే విస్కీ, వైన్‌ బ్రాండ్లనే అక్కడ అమ్మనున్నారు. అందులోనూ ఫారిన్ బ్రాండ్లనే అమ్మకానికి పెట్టనున్నారు.

అంటే రాష్ట్రంలో రిజిస్టర్‌ కాని బ్రాండ్లను కూడా ఈ షాపుల్లో కొనొచ్చన్నమాట. ట్యాక్స్‌ కట్టాకే ఈ ఫారిన్‌ లిక్కర్‌ను అనుమతిస్తారు కాబట్టి మళ్లీ అదనపు పన్ను వసూలేం చేయబోమని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

రాష్ట్రంలో ఎక్కడా దొరకని ఫారిన్‌ బ్రాండ్లను ఇక్కడ అమ్ముతారని వాణిజ్య పన్నుల శాఖ అదనపు చీఫ్‌ సెక్రటరీ ఐసీపీ కేశ్రీ చెప్పారు. ఆడవాళ్లు ఈజీగా లిక్కర్‌ కొనుక్కునేలా మాల్స్‌, మార్కెట్ ప్లేస్‌లో షాప్‌లను తెరుస్తామని పేర్కొన్నారు.

కాగా, రాష్ట్రంలో తయారుచేసే లోకల్‌ బ్రాండ్స్‌ను ప్రమోట్ చేసేందుకు భోపాల్, ఇండోర్, జబల్ పూర్, గ్వాలియర్‌లో వైన్ ఫెస్టివల్స్‌ నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో రత్మాల్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో తయారు చేసే ద్రాక్షపళ్ల మద్యాన్ని ప్రమోట్ చేసేందుకు 15 టూరిస్ట్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా దుకాణాలు తెరవనున్నట్టు కూడా అధికారులు వెల్లడించారు.

దేశంలో కర్ణాటక తర్వాత మద్యం ధరలు ఎక్కువగా మధ్యప్రదేశ్ లోనే ఉన్నాయి.