Hyderabad Drugs Raid: ‘అందరూ వెజిటేరియన్లే.. గిన్నెలోని మాంసం ఏమైనట్లో మాకు తెలియదు.. మా పిల్లలను నీసు ముట్టరు’ అన్నట్లు ఉంది డ్రగ్స్ కేసులో పట్టుబడిన ప్రముఖుల పిల్లల గురించి వారి తల్లిదండ్రులు చెబుతున్న మాటలు.. నాకేం తెలియదు.. మా పిల్లలు చాలా మంచోళ్లు.. అందులో మా పిల్లలు లేరు.. మీడియా అనవసర రాద్ధాంతం చేస్తోంది.. ఏదైనా ఘటనలో తమ పిల్లలు పట్టుబడగానే ప్రముఖులు ఇలా నీతి సూక్తులు వల్లె వేస్తుంటారు. కొంతమందైతే పబ్‌కు వెళ్లడం నేరమా..? పబ్‌కు వెళ్లే డ్రగ్స్ తీసుకున్నట్లు ఎట్ల ప్రచారం చేస్తరు… మేమూ మనుషులమే.. మాకంటూ వ్యక్తిగత జీవితం ఉండదా..? అంటూ ఎదరు ప్రశ్నిస్తుంటారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజాము వరకు పిల్లలు ఇంటికి రాకపోతే ఎక్కడున్నారనే విషయం కూడా కొంత మంది తెలుసుకోవడం లేదు. తీరా ఏదైనా పబ్‌లోనో, రేవ్ పార్టీలోనో, రిసార్ట్స్‌లోనో మద్యం తాగి, డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే మాత్రం ఆ ఘటనతో తమకేమీ సంబంధం లేదంటూ బుకాయిస్తున్నారు. తాజాగా బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ పబ్‌లో రేవ్ పార్టీలో పాల్గొని టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడినవారి కుటుంబ సభ్యులందరూ డ్రగ్స్‌తో సంబంధం లేదంటూ ఒకేతీరుగా సమాధానాలు చెబుతున్నారు. ఎక్కడ పార్టీల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రముఖుల పిల్లలు పట్టుబడ్డా ఇలాగే బుకాయిస్తున్నారు.

– రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్‌పై కూడా అప్పట్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇవే ఆరోపణలు చేశారు. దీన్ని కోర్టుకు వెళ్లి మరీ కేటీఆర్ అడ్డుకున్నారు. ఇలాంటివి చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక సినీ తారలపై గతంలో రాష్ట్ర ఎక్సైజ్ అధికారులు డ్రగ్స్ కేసులో విచారణ జరిపారు. ఈ సమయంలో మంత్రి కేటీఆర్ ఓ హీరోయిన్‌తో సన్నిహితంగా ఉంటాడని, డ్రగ్స్ తీసుకుంటాడని ఆరోపించారు. దీంతో కేసీఆర్ విమర్శలకు సమాధానం చెప్పలేక కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. అప్పటి నుంచి విమర్శల దాడి తగ్గింది. ఈ క్రమంలో బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌లో డ్రగ్స్ పట్టుబడడంతో దీనికి సూత్రధారి కేటీఆర్ అని నిజామాడాద్ ఎంపీ ఆర్వింద్ ఆరోపిస్తున్నారు. కేటీఆర్ కెప్టెన్సీలోనే రాష్ట్రంలో డ్రగ్స్ దందా జరుగుతోందని తీవ్రస్థాయలో ఆరోపణ చేశారు.
– ఇటీవల జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో అదుపు తప్పిన వేగంతో దూసుకొచ్చి బోధన్ ఎమ్మెల్యే షకీల్ తనయుడు ఓ చంటి బిడ్డ ప్రాణాన్ని బలిగొన్న ఘటనలో ఆ నేత ఆ కారులో తన కొడుకే లేడంటూ గట్టిగా వాదించాడు. తీరా చూస్తే కారులో వెనుక సీటులో ఆ నేత కొడుకు దర్జాగా కూర్చొని ఉన్నాడు.
– బంజారాహిల్స్‌లోని రాడిసన్‌బ్లూ హోటల్‌కు అనుబంధంగాఈ ఉన్న పుడింగ్ అం మింక్ పబ్‌పై ఆదివారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన దాడిలో మెగస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు తనయ నిహారిక పట్టుబడింది. మీడియాలో నిహారికను పోలీసులు అదుపులోకి తీసుకున్న దృశ్యాలు టీవీల్లో రావడంతో నాగబాబు స్పందించారు. డ్రగ్స్‌తో తన కూతురుకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. పోలీసులు కూడా ఈమేరకు క్లీన్‌చిట్ ఇచ్చారని తెలిపారు.

– ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా పబ్‌లో పోలీసులకు పట్టుపడ్డారు. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం పంపించారు. సాయంత్రం ఆయన మీడియా కథనాలపై స్పందించారు. బబ్‌కు వెళ్లడం నేరమా అని ప్రశ్నించారు. పబ్‌కు వెళితే డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలా ప్రచారం చేస్తారు.. మేమూ మనుషులమే కదా.. మాపై ఇలా తప్పుడు ప్రచారం చేయడం ఏమిటి.. ఓ బర్త్‌డే వేడుకల కోసమే నేను కుటుంబ సభ్యులతో కలిసి పబ్‌కు వెళ్లాను.. డ్రగ్స్ అంటే ఏమిటో నాకు తెలియదు. యాంటీ డ్రగ్స్‌పై నేనే ప్రచారం చేశా’ అని వివరించారు.
– డ్రగ్స్‌లో పట్టుబడిన వారి పేర్లలో సినీనటి హేమ పేరు రావడంతో ఆమె బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని హంగామా చేశారు. తాను పంబ్‌లోనే లేనని.. అయినా తాను ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా ఈ రోజుల్లో డ్రగ్స్ తీసుకోవడం కామన్ అంటూ వ్యాఖ్యానించారు. కూలీ పని చేసుకునే వాడి కొడుకు కూడా గంజాయి తీసుకుంటున్నాడని చెప్పుకొచ్చారు. మీడియా కావాలనే సినీ నటులను బద్నాం చేస్తోందని ఆరోపించారు.
– కాంగ్రెస్ నేత ముఖేశ్‌గౌడ్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ కుమారుడు కూడా పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో పట్టుబడిన వారిలో ఉన్నారు. తమ కుమారుల పేర్లు మీడియాలో ప్రచారం కావడంతో సదరు నేతలు స్పందించారు. తమ పిల్లాలకు డ్రగ్స్‌తో ఎలాంటి సబంధం లేదని ప్రకటించారు. కావాలనే తమ రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఇలా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం అంటూ ఖండించారు.
– ‘మా బాబుకు ఏ పాపం తెలియదు.. పబ్ నిర్వహిస్తే డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ప్రచారం చేయడం, తప్పుడు కేసులు పెట్టడం సరికాదు. వాస్తవాలను బయట పెట్టాలి. మా కొడుకుపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టి ప్రముఖులను తిప్పంచే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలను బయట పెట్టాలి’ అని పబ్ యజమాని అభిషేక తల్లి డిమాండ్ చేస్తున్నారు.
కాగా, పోలీసులు డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానం ఉన్నవారి రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఆ పరీక్షలను బట్టే ప్రముఖుల పుత్రరత్నాల ‘డ్రగ్స్’ కథలు బయటపడుతాయి. అప్పటివరకూ అందరూ ఎదురుచూడాల్సిందే.. ఏది ఏమైనా ప్రముఖుల పిల్లలంతా సుద్ధపూసలు అయితే.. మరి డ్రగ్స్ ఏమైనట్లో పోలీసులే తేల్చాలి.