స్పీకర్ సంచలన వ్యాఖ్యలు..!

శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడటం విశేషం. రాష్ట్రంలో మద్యం, నాటు సారా విక్రయాలపై ఆయన తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు మద్యం సరఫరాకు అడ్డుకట్ట వేయడంలో ఎక్సైజ్ శాఖ విఫలం అయ్యిందన్నారు. ఈ అంశాన్ని సీఎంతో స్వయంగా చెప్పాలనుకున్నానని, కుదరక పోవడంతో మీడియా ద్వారా చెబుతున్నానని తెలిపారు. ఎక్సైజ్ శాఖ రాష్ట్రంలో ఎం చేస్తోంది.. నిద్రపోతుందా అంటూ విరుచుకుపడ్డారు. గతంతో తనకు ఎక్సైజ్ శాఖ మంత్రిగా […]

Written By: Neelambaram, Updated On : April 25, 2020 4:37 pm
Follow us on


శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడటం విశేషం. రాష్ట్రంలో మద్యం, నాటు సారా విక్రయాలపై ఆయన తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు

మద్యం సరఫరాకు అడ్డుకట్ట వేయడంలో ఎక్సైజ్ శాఖ విఫలం అయ్యిందన్నారు. ఈ అంశాన్ని సీఎంతో స్వయంగా చెప్పాలనుకున్నానని, కుదరక పోవడంతో మీడియా ద్వారా చెబుతున్నానని తెలిపారు. ఎక్సైజ్ శాఖ రాష్ట్రంలో ఎం చేస్తోంది.. నిద్రపోతుందా అంటూ విరుచుకుపడ్డారు. గతంతో తనకు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేసిన అనుభవం ఉందని చెప్పుకొచ్చారు.

అక్రమంగా మద్యం, నాటు సారా విక్రయాలు చేస్తూ రాత్రికి రాత్రే కోటీశ్వర్లు, లక్షాధికారులు అయిపోతున్నారని చెప్పారు. గంజాయి, గుట్కాల విక్రయాలు ఎక్కడపడితే అక్కడ జోరుగా సాగుతున్నాయన్నారు. ఇటీవల ఆముదాలవలసలో ఒక గది నిండా గుట్కా లు, గంజాయి లభించిందని చెప్పారు. ఇందుకు సంబంధించిన చట్టాలు కఠినంగా అమలు చేయాలన్నారు. ఈ మాఫియాను ఇదే విధంగా వదిలేస్తే ప్రభుత్వాన్నే శాసించే స్థాయికి చేరుకుంటాయని తెలిపారు. ఎప్పటికైనా అక్రమ మద్యం, గంజాయి, గుట్కా విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వానికి సూచించారు.