TDP: రాజకీయాల్లో కూడా పలు నూతన పంథాలు వస్తున్నాయి. ఇన్నాళ్లు హుందాగా సాగిన రాజకీయాలు నేడు పలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. నాయకుల్లో కూడా నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీని చిత్తు చేసే క్రమంలో ఎన్నో వ్యయప్రయాసలకు కూడా పాల్పడటం చూస్తుంటే రాజకీయాలు ఎక్కడికో వెళ్లిపోయాయని తెలుస్తోంది. వారు కూడా ఉగ్రవాదుల్లా మారిపోతున్నారు. తమ గుట్టు బయటకు రాకుండా ఉండేందుకు పలు మార్గాలు అన్వేషిస్తున్నారు.

తాజాగా టీడీపీ కూడా అదే బాటలో పయనిస్తోంది. ఇటీవల నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ బీసీ సెల్ పార్లమెంట్ అధ్యక్షుడు కప్పిర శ్రీనివాసులు డబ్బులు పంచుతుండగా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కానీ ఆయనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ప్రశ్నించారు అంతే. దీంతో ఆయన స్టేషన్ లోనే నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో ఆస్పత్రికి తరలించారు.
ఈ నేపథ్యంలో నేతల్లో వస్తున్న మార్పుకు అందరు ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడ గుట్టు బయట పడుతుందోననే సాకుతో ఆత్మహత్యా యత్నం చేసి తనపై కేసు లేకుండా చేసుకుని నేరం నుంచి బయట పడేందుకు ఉపాయం పన్నినట్లు తెలుస్తోంది. పైగా సానుభూతి కూడా తెచ్చుకునేందుకు ఆస్కారం ఏర్పడింది. దీంతో నేతల్లో రోజురోజుకు మార్పులు వస్తున్నట్లు చెబుతున్నారు.
Also Read: Congress Politics: అక్కడా అదే సీన్.. టార్గెట్ రేవంత్ రెడ్డి..?
తమ మాట నెగ్గించుకునే క్రమంలో పలు దారులు వెతుకుతున్నారు. నిద్రమాత్రల విషయంలో ప్రాణాలు పోయేంత పరిస్థితి రాకున్నా అయ్యో అనుకునేలా ప్రవర్తించడం ప్లాన్ లో ఒక భాగంగానే పరిగణిస్తున్నారు. ఏదిఏమైనా టీడీపీ నేతలు మాత్రం తెలివి మీరుతున్నారని తెలుస్తోంది. భవిష్యత్ లో జరిగే ఎన్నికల్లో ఇంకా ఎన్ని ప్రణాళికలు అమలు చేసి ప్రజలను బురిడీ కొట్టిస్తారో వేచి చూడాల్సిందే.
Also Read: Amit Shah: అమిత్ షా సైతం డ్రగ్స్ పై పడ్డాడే.. షాక్ జగన్ కా? ఉద్దవ్ ఠాక్రేకా?