Sonu Sood on Twitter: ఆపద సమయంలో ఆదుకుంటూ దాన ధర్మాలు చేస్తోన్న సోనూసూద్ కి “కలియుగ కర్ణుడు” అంటూ బిరుదులు ఇచ్చారు. కాగా ఈ “కలియుగ కర్ణుడు” తాజాగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు పై మాట్లాడాడు. ఈ విషయం పై సోనూసూద్ స్పందిస్తూ.. ‘18వేల మంది భారతీయ విద్యార్థులు, కుటుంబాలు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయాయి.
వారిని వెనక్కి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తుందని నేను అనుకుంటున్నాను. వారి తరలింపు కోసం ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాలని కోరుతున్నాను. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అని సోనూసూద్ ట్వీట్ చేశాడు. అయితే, మరోపక్క ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు బాధ్యతను సోనూసూదే తీసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: ఏపీలో భీమ్లానాయక్ షో వేయలేక థియేటర్ల మూసివేత.. అసలు కారణాలు ఇవే
అన్నట్టు సోనూసూద్ మైక్రో-బ్లాగింగ్ సైట్‌లో 11 మిలియన్ల మంది అనుచరుల మార్క్‌ను సాధించాడు. భారతదేశంలో అత్యధికంగా అనుసరించే ప్రముఖులలో ఒకడిగా సోనూసూద్ నిలవడం విశేషం. అంతే కాకుండా ట్విట్టర్‌లో ఆయన చాలా యాక్టివ్‌గా ఉండటంతో పాటు సమస్యలపై తనదైన రీతిలో స్పందిస్తూ వస్తున్నాడు.
అసలు కరోనా మహమ్మారి దావానలంగా దేశం మొత్తం వ్యాప్తి చెంది, జనాన్ని ముప్పు తిప్పలు పెడుతూ దొరికిన వారిని దొరికినట్లు పొట్టన పెట్టుకుంటూ ఉన్న కాలంలో కూడా ఎంతోమందిని ఆదుకున్నారు సోనూసూద్. అసలు కరోనా దేశ స్థితి గతులని అస్తవ్యస్తం చేస్తోన్న తరుణంలో పేద ప్రజల పరిస్థితిని బాగు చేయడానికి సోనూసూద్ చాలా సేవ చేశాడు. అలాగే, కరోనా సోకి సరైన వైద్యం అందక చాలా ఇబ్బందులు పడుతున్న వారికి కూడా సోనూసూద్ మంచి వైద్యం చేయించాడు. ఇది గొప్ప విషయమే.
Also Read: భీమ్లా నాయక్ లో ఆ డైలాగ్ జగన్ ని ఉద్దేశించి పెట్టారట