బీజేపీకి షాకిచ్చేలా సోనియా మాస్టర్ ప్లాన్

లోక్ సభలో 300మందికి పైగా ఎంపీలున్నారనే బలంతో బీజేపీ చాలా చట్టాలను, బిల్లులను ఆమోదింప చేసుకుంటోంది. రాజ్యసభలోనూ బలం పెంచుకొని.. ప్రాంతీయ పార్టీలతో పని కానిచ్చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా తాజాగా బీజేపీ చేసిన వ్యవసాయ బిల్లులపై రైతు లోకం ఆగ్రహంతో ఊగిపోతోంది. వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, ప్రతిపక్షాలు, రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో అయితే బంద్ కూడా విజయవంతం అయ్యింది. Also Read: బీజేపీ మాస్టర్ ప్లాన్: తెలుగు రాష్ట్రాల్లో ‘కొత్త […]

Written By: NARESH, Updated On : September 29, 2020 3:26 pm
Follow us on


లోక్ సభలో 300మందికి పైగా ఎంపీలున్నారనే బలంతో బీజేపీ చాలా చట్టాలను, బిల్లులను ఆమోదింప చేసుకుంటోంది. రాజ్యసభలోనూ బలం పెంచుకొని.. ప్రాంతీయ పార్టీలతో పని కానిచ్చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా తాజాగా బీజేపీ చేసిన వ్యవసాయ బిల్లులపై రైతు లోకం ఆగ్రహంతో ఊగిపోతోంది. వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, ప్రతిపక్షాలు, రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో అయితే బంద్ కూడా విజయవంతం అయ్యింది.

Also Read: బీజేపీ మాస్టర్ ప్లాన్: తెలుగు రాష్ట్రాల్లో ‘కొత్త నేతల’ పాగా..!

ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ బీజేపీకి షాకిచ్చేలా సంచలన  సూచనలను రాష్ట్రాలకు చేశారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిరంకుశ వ్యవసాయ చట్టాలను అధిగమించే చర్యలు, ప్రయత్నాలపై దృష్టి పెట్టాలని.. రైతులను రక్షించే చట్టాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.  వ్యవసాయ చట్టాలను తిరస్కరించడానికి కొత్త చట్టాలను తేవాలని రాష్ట్రాలకు సోనియా సూచన చేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను అమలు చేయకుండా ఉండేందుకు ఉన్న అన్ని అవకాశాలను అన్వేషించాలని సోనియా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఇదే సమయంలో కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు అమలు చేయకుండా కొత్తగా రాష్ట్రాలే చట్టాలు చేయాలని.. ఈ మేరకు అన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతోపాటు మిగతా రాష్ట్రాలు కూడా ఆలోచన చేయాలని సోనియాగాంధీ కీలక సూచనలు చేశారు.

Also Read: చైనా బయోవార్.. భారత్ కు పెను ముప్పు?

ఇదేగనుక జరిగితే కేంద్రం ఆమోదించిన వ్యవసాయ బిల్లుల చట్టం రాష్ట్రాల్లో అమలు కాదు. ఇప్పటికే బీజేపీ తప్పా అన్ని ప్రాంతీయ పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకించాయి. ఇప్పుడు  సోనియా సూచనను పాటిస్తే దేశంలో దుమారం రేగడం ఖాయం. రాష్ట్రాలు అమలు చేయకుంటే బీజేపీకి భారీ షాక్ తగులుతుంది. రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుంది. ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.