కరోనా మహమ్మారి వల్ల తీవ్ర సంక్షోభంతో పాటు ఆ మహమ్మారి బారిన పడి.. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతూ ఏమి చేయలేని నిస్సహాయతలో కొట్టుమిట్టాడుతున్న పేద రోగులకు ఉచిత ప్లాస్మాను తన బ్లడ్ బ్యాంకు ద్వారా వితరణ చేసేందుకు పూనుకున్నారు మెగాస్టార్. తెల్ల రేషన్ కార్డులు, ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న పేద రోగులకు ప్లాస్మాను ఉచితంగా తన బ్లడ్ బ్యాంక్ ద్వారా సరఫరా చేస్తున్నామని.. అర్హులైన ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెగాస్టార్ కోరారు. ఈ కరోనా కష్టకాలంలో పేదలకు కనీస చికిత్స కూడా దొరకని ఈ భయంకరమైన రోజుల్లో మెగాస్టార్ చేస్తోన్న ఈ సేవ ఎంతోగొప్పది.
Also Read: ఆకట్టుకుంటున్న మామాకోడళ్ల ముచ్చట్లు !
ఇప్పటికే ప్లాస్మా దొరక్క పేదవాళ్ళు చాలా ఇబ్బందలు పడుతున్నారు. వారందరికీ ఇపుడు మెగాస్టార్ అండగా నిలిచి దేవుడు అయ్యారు. ఇప్పటికే మెగాస్టార్ కరోనా నుండి తెలుగు సినీ కార్మికులకు ఉపశమనం కలిగించడానికి కరోనా క్రైసిస్ ఛారిటీ పెట్టి.. దాదాపు ఐదు నెలలు నుండి సుమారు 11 వేలమందికి ఆకలి తీరుస్తూ వస్తున్నారు. సినీ కార్మికులకు నాలుగు సార్లు సరుకులు ఇచ్చిన మెగాస్టార్, మళ్ళీ ఐదోసారి కూడా కార్మికులకు సరుకులను పంపణి చేయటానికి సన్నద్ధం అవుతున్నారు. సినిమా జనం పస్తులు పడుకోకుండా వారి ఆకలి కన్నీళ్లు తుడుస్తూ.. వస్తున్నారు మెగాస్టార్. పేదవాడ్ని ఆపదలో ఆదుకుని గుప్పెడు సాయం చేసేవాడే లేడని బాధ పడే ఈ రోజుల్లో మెగాస్టార్ నిజంగా దేవుడే.
Also Read: క్రైమ్ థ్రిల్లర్ ‘పరిగెత్తు పరిగెత్తు’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల!
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న ఆచార్య సినిమా తరువాత మెహర్ రమేష్ సినిమానే ఉండొచ్చు అని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. వేదాళం రీమేక్ నే వీళ్ళు చేయబోతున్నారు. మెహర్ స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేశాడు. ఈ సినిమా తరువాత మెగాస్టార్ ‘లూసిఫర్’ రిమేక్ చేయనున్నారు. ఈ సినిమా దర్శకుడు వినాయక్ డైరెక్షన్ లో రాబోతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా సినిమా లేక ఖాళీగా ఉన్న వినాయక్ కి మెగాస్టార్ పిలిచి మరీ ‘లూసిఫర్’ సినిమాను వినాయక్ చేతిలో పెట్టారు.
అన్నయ Chiranjeevi Eye & Blood Bank లో కారొన పేషంట్ లకు ఉచితంగా ప్లాస్మా వితరణ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు . తెల్ల రేషన్ కార్డు దారులు , ప్రభుత్వ ఆసుత్రుల్లో చికిత్స పొందుతున్న వారు దీనిని సద్వినియోగం చేసుకోగలరు .
Share this and help to save the lives of poor people. pic.twitter.com/wdSnglKvDz
— Megastar Chiranjeevi (@ChiruFanClub) September 29, 2020