అడ్వాన్స్‌గా సుకుమార్ అన్ని కోట్లు తీసుకున్నాడా?

కరోనా సమయంలో థియేటర్లు మూతపడగా, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో చిత్ర పరిశ్రమ అంతా ఎన్నడూ లేనివిధంగా కుదేలైపోయింది. గత ఆరునెలలుగా థియేటర్లు మూతపడటంతో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక షూటింగులకు ఇప్పుడిప్పుడే మొదలైన కొద్దిమందితోనే చిత్రీకరణ చేస్తుండటంతో నటీనటులంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Also Read: ఉచితంగా ప్లాస్మా.. మెగాస్టార్ నిజంగా దేవుడే ! కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శక, నిర్మాతలు షూటింగులను చేస్తున్నాయి. కరోనా ఎఫెక్టుతో చిత్రసీమ కుదేలవడంతో పలువురు […]

Written By: NARESH, Updated On : September 29, 2020 3:21 pm
Follow us on


కరోనా సమయంలో థియేటర్లు మూతపడగా, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో చిత్ర పరిశ్రమ అంతా ఎన్నడూ లేనివిధంగా కుదేలైపోయింది. గత ఆరునెలలుగా థియేటర్లు మూతపడటంతో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక షూటింగులకు ఇప్పుడిప్పుడే మొదలైన కొద్దిమందితోనే చిత్రీకరణ చేస్తుండటంతో నటీనటులంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Also Read: ఉచితంగా ప్లాస్మా.. మెగాస్టార్ నిజంగా దేవుడే !

కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శక, నిర్మాతలు షూటింగులను చేస్తున్నాయి. కరోనా ఎఫెక్టుతో చిత్రసీమ కుదేలవడంతో పలువురు స్టార్ హీరోహీరోయిన్లు, దర్శకులు తమ రెమ్యూనేషన్ తగ్గించుకునేలో పడ్డారు. కరోనా సమయంలో నిర్మాతను కాపాడుకోవాలని సదుద్దేశ్యంతోనే స్టార్ హీరోహీరోయిన్లు తమ పారితోషకంగా కొంత కోత విధించుకుంటున్నారనే వార్తలు విన్పిస్తున్నాయి.

కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఓ నిర్మాత మాత్రం దర్శకుడు సుకుమార్ కోసం ఏకంగా రూ.10కోట్ల అడ్వాన్స్ ముందుగా ఇచ్చినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. అంతేకాకుండా మరో ఐదుకోట్ల వరకు అడ్వాన్సుల పేరిట ఖర్చు చేసినట్లు వార్తలు విన్పిస్తున్నాయి. దీంతో ఈ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ నిర్మాత ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది.

హీరో అల్లు అర్జున్ కు అత్యంత సన్నితంగా ఉంటే నిర్మాత కేదర్ దర్శకుడు సుకుమార్ తో ఓ సినిమా నిర్మించబోతున్నారు. 2022లో ఈ సినిమా ప్రారంభం కాబోతుంట. మరో ఏడాదిన్నర సమయం ఉండగానే దర్శకుడు సుకుమార్ కు రూ.10కోట్లు అడ్వాన్స్ ఇచ్చి కేదార్ ముందుగానే డేట్స్ బుక్ చేసుకున్నట్లు టాక్ విన్పిస్తోంది.

Also Read:హీరో సూర్య ఆఫీస్ లో బాంబు అంటూ కాల్.. చివరకు..?

2022 నాటికి సినిమా ఇండస్ట్రీ తిరిగిగాడిన పడటం ఖాయమనే తలంపుతోనే ముందుగానే నిర్మాతకు సుకుమార్ ను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. ఆయనతోపాటు పలువురు నటీనటులు, సాంకేతిక సిబ్బందికి మరో ఐదు కోట్లు ఖర్చు చేశారట. కరోనా టైంలోనూ 15కోట్లు నిర్మాత అడ్వాన్సుల పేరిట ఖర్చు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై దర్శకుడు సుకుమార్ ఎలాంటి క్లారిటీ ఇస్తాడో వేచి చూడాల్సిందే..!