Homeఆంధ్రప్రదేశ్‌ఇళ్ల సొమ్ము కేంద్రానిది.. సోకు జగన్ దా?

ఇళ్ల సొమ్ము కేంద్రానిది.. సోకు జగన్ దా?

సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది అన్నట్టుగా సీఎం జగన్ తీరు ఉందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. ఏపీలో కడుతున్న ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి మొత్తం నిధులు తీసుకుని తమ పేర్లు పెట్టుకుంటున్నారని విమర్శించారు. ఇళ్ల నిర్మాణానికి మొత్తం ఖర్చులన్నీ కేంద్రం ఇస్తుంటే ఇంక మీరు ఏం చేస్తారని సిఎం జగన్ ను సోమువీర్రాజు ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జగన్ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. రైతులకు కనీస మద్దతు ధరను ఇప్పించని ప్రభుత్వం వారిని దోచేస్తుందని ఆవేదన చెందారు. అస్తిపన్నుల పెంపు, చెత్తపై పన్నుల విధింపును బీజేపీ వ్యతిరేకిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక చెప్పారు. విధానాలపై జనసేనతో కలపి పోరాడతామని

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో రాష్ట్రం ఇళ్లను కడుతున్నా ఎక్కడా పిఎంఏవై పేరు కనిపించడం లేదని సోము వీర్రాజు నిప్పులు చెరిగారు.. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి 23 లక్షల ఇళ్లను రాష్ట్రానికి ఇవ్వడానికి ప్రతిపాదనలు పంపారని.. కానీ రాష్ట్రం 15 లక్షల ఇళ్లనే కడతామందని.. ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షలు, నరేగా కింద మరో రూ.30 వేలు మొత్తం రూ.1.80 లక్షలు కేంద్రం ఇస్తుందన్నారు. మొత్తం రూ.15 లక్షల ఇళ్లకు 23 వేల కోట్లు ఇస్తుందని.. ఇవి మొత్తం ఖర్చుచేస్తే మరో 8 లక్షల ఇళ్లు ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 30 లక్షల పట్టాల కాలనీలకు రూ.3వేల కోట్ల ఖర్చుతో నరేగా నిధులతో రోడ్లు వేశారని విమర్శించారు 30 లక్షల స్థల సేకరణకు 23 వేల కోట్ల లెక్కలు చెబుతున్నారు. ఇందులో కేవలం రూ.7 వేల కోట్లుమాత్రమే ఖర్చుచేసారని విమర్శించారు.. మిగతాదంతా ప్రభుత్వ భూములేనన్నారు. వాటికే లెక్కవేసి మొత్తం రూ.23 వేల కోట్లు చెబుతున్నారని జగన్ సర్కార్ పై మండిపడ్డారు.. ఇప్పుడు మౌలిక సదుపాయాల పేరు చెప్పి మరో రూ.4 వేల కోట్లు కావాలని కేంద్రాన్ని అడుగుతున్నారన్నారు.. లబ్దిదారులకు సబ్సిడీ ఇవ్వక, మౌలికసదుపా యాలకు డబ్బు ఇవ్వక కేంద్ర నిధులతోనే ఇళ్ల కడితే ఇంక మీరెందుకు? అని విమర్శించారు. ఇళ్ల కాలనీలకు బీజేపీ సాయాన్ని మరిచి మీ తండ్రి. మీవి పేర్లు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు లక్ష సబ్సిడీ ఇవ్వాలి. ఇసుక ఉచితంగా, సిమెంటు సబ్సిడీపై ఇవ్వాలి. ఇళ్లను ప్రజలే కట్టుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోరాదు అన్నట్టుగా జగన్ తీరు ఉందని విమర్శించారు.

ఈ ఏడాది రైతులకు ఇవ్వాల్సిన రుణ లక్ష్యం రూ.1.48.50 కోట్లుగా పేర్కొన్నారని… రుణ వార్షిక బడ్జెట్ రూ.2,83,380 కోట్లుగా చెప్పారని.. ఇది రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువ అని సోము వీర్రాజు విమర్శించారు. చంద్రబాబు హయాంలో వ్యవస్థల పట్ల నమ్మకం సన్నగిల్లింది. ఈ ప్రభుత్వానికి వ్యవస్థల పట్ల అవగాహనే లేదని విమర్శించారు.. రూ.45 లక్షల టన్నుల ధాన్యం కొంటామన్నారు. రూ.25 లక్షలు సేకరించామన్నారు. చంద్రబాబు, జగన్ ఇరువరి పాలనలోనూ మిల్లర్లు రైతులను దోచేస్తున్నారు. కనీస మద్దతు ధరను రూ.1,400లకు ఇప్పించని ప్రభుత్వాలివి. రైతు భరోసా కేంద్రాలు రైతులను దగా చేస్తున్నాయి. ఈ ప్రభుత్వాలు మిల్లర్ల చేతిలో కీలుబొమ్మలు. మిల్లర్లదళారుల చేతిలో రైతులు నష్టపోతున్నారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన అప్పులు ఇస్తే ఎందుకు తక్కువ ధరకే ప్రైవేటు వారికి ధాన్యాన్ని అమ్ముకుంటున్నాడు. ప్రభుత్వం 2 నెలలుగా డబ్బులు ఇవ్వకపోవడం వల్లే తక్కువైనా అమ్ముకోవాల్సివస్తోంది. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం హయాంలో రైతులకు రవాణా ఖర్చులు ఇవ్వలేదు. కొత్త ధాన్యపు సంచులు ఇవ్వలేదు. రైతులను మోసం చేసి దోచేయడమే లక్ష్యంగా పౌరసరఫరాల శాఖ ఎండీలు ఒక్కో కేంద్రంలో నాలుగైదేళ్లు డిప్యుటేషన్పై పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వం వ్యవస్థల్ని సరిచేయడం లేదు. రైతులకు భరోసా ఇవ్వడానికి భాజపా పెద్దఎత్తున ఉద్యమాలు చేసి వత్తిడి తెస్తుంది.

లారీ ఇసుకను వాస్తవ ధరకన్నా రూ.5 వేలు ఎక్కువకు అమ్మడం ప్రభుత్వం దోపిడి కాదా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. కేంద్ర పథకాల ద్వారా వచ్చే నిధులను తమ పథకాలుగా చెప్పుకుంటున్నారన్నారు.. నేషనల్ హెల్త్ మిషన్ నిధులతో జగనన్న కళ్లజోడు పథకం అమలుచేస్తున్నారు. సర్వశిక్షా అభియాన్ నిధులు ఏడాదికి రూ.5వేల కోట్లు వస్తాయి. ఆ నిధులతో జగనన్న బూట్లు, యూనిఫాం, పుస్తకాలు, మధ్యాహ్నభోజనం, టీచర్లకు జీతాలు, కంప్యూటర్ కేంద్రాలు ఇలా మీ పేర్లు పెట్టుకుంటున్నారు. రైతు భరోసా కేంద్రం, పంచాయతీ భవనం, జగనన్న హెల్త్ క్లినిక్లు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) నిధులతో నిర్మించేవే. ఈ కార్యక్రమాలను భాజపా గమనిస్తోంది. నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ డెవలెమెంట్ కార్పొరేషన్, నేషనల్ ఎస్టీ ఫైనాన్స్ డెవలెమెంట్ కార్పొరేషన్, నేషనల్ బీసీ ఫైనాన్స్ డెవలెమెంట్ కార్పొరేషన్లు ఆయా వర్గాలకు ఇచ్చే జీవనాధార రుణ పథకాలు రెండేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు.

అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని ఏపీ బీజేపీ అధ్యక్షులు విమర్శించారు.. సంక్షేమ పథకాలకు అప్పులుచేస్తారు. కాని అభివృద్ధి పనులకు చెయ్యరు. కాకినాడలో రూ.40 వేల కోట్లతో హెచ్సీఎల్ పెట్రో కెమికల్ కాంప్లెక్సు నిర్మిస్తుంది. దానిలో మౌలికసదుపాయాలకు కేంద్రం అందిస్తుంది. అయితే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద రూ.900 కోట్లు ఇవ్వాలని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. విశాఖలో ఇఎస్ఐకు చెందిన బోధనాసుపత్రి నిర్మాణానికి రూ.50 కోట్లు ఇవ్వంటే ఇవ్వరు. విశాఖలో భవనాల కూల్చివేతపై జడ్జిని నియమించి అక్రమ నిర్మాణాలైతే చర్యలు తీసుకోవాలి. అస్తిపన్నుల పెంపు, చెత్తపై పన్నుల విధింపును భాజపా వ్యతిరేకిస్తుంది. వాటిపై ఉద్యమిస్తుంది. రాష్ట్రంలోని రెండు రాజకీయపార్టీలు కుటుంబపాలన, అభివృద్ధి నిరోధక ఎజెండా లక్ష్యంగా పనిచేస్తున్నాయి.

ప్రభుత్వం చేసే తప్పులు బయటపెట్టి ఉద్యమాలు చేస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు కమిటీలు పనిచేసి క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తుందన్నారు. ప్రజాపక్షంగా బీజేపీ, జనసేన కలసి పోరాడతామన్నారు.

మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విష్ణువర్ధనరెడ్డి, సూర్యనారాయణరాజు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బిట్రా వెంకట శివన్నారాయణ. మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజి తదితరులు పాల్గొన్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular