మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీలో కీలకమైన నేత. నెల్లూరు రాజకీయాల్లో గత మూడు దశాబ్దాలుగా ఆయన సొమిరెడ్డి సత్తా చాటుతున్నారు. చంద్రబాబు నాయుడికి అత్యంత దగ్గరైన వ్యక్తుల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒకరు. బాబు క్యాబినెట్లో మంత్రి పదవీ దక్కించుకొని నెల్లూరు జిల్లాల్లో ఆయన చక్రం తిప్పారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సోమిరెడ్డికి కొత్త తలనొప్పులు వచ్చిపడుతున్నారు. తనకు సంబంధంలేని విషయంలో చంద్రబాబుతో చీవాట్లు తినాల్సి వచ్చిందని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: బాబును రాజీ’డ్రామా’లతో కొట్టాలనుకున్న జగన్
గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్నిచోట్ల దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను తొలగించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నాడు చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. అయితే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇలాంటి సంఘటన కావలిలో చోటుచేసుకుంది. కావలి పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని వైసీపీ నేతలు పక్కకు తొలగించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారడంతో చంద్రబాబు సోమిరెడ్డికి ఫోన్ చేసి మందలించారట. ఇన్నాళ్లు రాజకీయాల్లో ఉన్నావు.. ఎన్టీఆర్ విగ్రహాన్ని నిలబెట్టలేవా? అంటూ అనడంతో ఈ ఇష్యూను ఆయన సవాలుగా తీసుకొని పోరాటానికి సిద్ధమయ్యారనే టాక్ విన్పిస్తోంది.
ఎన్టీఆర్ విగ్రహం పునఃప్రతిష్టించాలని సోమిరెడ్డి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్ వినతిప్రతం అందజేశారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నించిన దుండగులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసి వైసీపీ నేతల తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించేలా సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆయనకు టీడీపీ నేతల నుంచి పెద్దగా సపోర్టు రాకపోవడంతో ఆయన పోరాటం వృథా మారుతుందని వాపోతున్నారట.
Also Read: బీజేపీ లైట్.. కాంగ్రెస్ తోనే టీఆర్ఎస్ పోటీనా?
ఎన్టీఆర్ విగ్రహా పోరాటంలో జిల్లా నేతలు పెద్దగా సహకరించకపోవడంతో ఉద్యమం రోజురోజుకు నీరుగారిపోతుందని సోమిరెడ్డి ఆందోళన చెందుతున్నారు. జగన్ సర్కార్ ఎలాగూ ఆయన మాట వినే పరిస్థితి లేదని.. మరోవైపు చంద్రబాబు నాయుడు తన సత్తాకు పరీక్ష పెట్టడంతో సోమిరెడ్డి లోలోపల కుమిలిపోతున్నారట. దీంతో ఎన్టీఆర్ విగ్రహం పునః ప్రతిష్టించడం ఆయనకు పెద్దగా సవాలుగా మారిందనే వాదనలు విన్పిస్తున్నారు. జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన ఈ నేతకు ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు ఆయనను పార్టీలో ఒంటిరి వాడిలా మార్చిందనే ప్రచారం జరుగుతోంది. మున్మందు ఈ విగ్రహా రాజకీయం ఎలాంటి మలుపులు తీసుకోనుందో వేచి చూడాల్సిందే..!