https://oktelugu.com/

హమ్మయ్య ఎట్టకేలకు హీరో దొరికాడు !

‘దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ లాంటి బిలౌవ్ ఏవరేజ్ సినిమాల డైరెక్టర్ ‘వంశీకృష్ణ’. పాపం పేరుకు రెండు సినిమాలు చేసినా మనోడికి పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. మధ్య మధ్యలో మంచు లక్ష్మి పోగ్రామ్స్ కి డైరెక్టర్ గా చేయడం వల్ల పూర్తి సినిమా డైరెక్టర్ గా సక్సెస్ కాలేకపోయాడు. అయితే వంశీకృష్ణ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వర్రావు’ అనే బయోపిక్ ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం మొదలైన సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమాలో రానా హీరో. […]

Written By:
  • admin
  • , Updated On : August 3, 2020 12:30 pm
    Follow us on


    ‘దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ లాంటి బిలౌవ్ ఏవరేజ్ సినిమాల డైరెక్టర్ ‘వంశీకృష్ణ’. పాపం పేరుకు రెండు సినిమాలు చేసినా మనోడికి పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. మధ్య మధ్యలో మంచు లక్ష్మి పోగ్రామ్స్ కి డైరెక్టర్ గా చేయడం వల్ల పూర్తి సినిమా డైరెక్టర్ గా సక్సెస్ కాలేకపోయాడు. అయితే వంశీకృష్ణ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వర్రావు’ అనే బయోపిక్ ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం మొదలైన సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమాలో రానా హీరో. రానా పై కొన్ని సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ కూడా చేశారు. షూట్ చేసిన తరువాత ఆ పార్ట్ నచ్చలేదో.. లేక డైరెక్టర్ వర్క్ నచ్చలేదో గాని మొత్తానికి రానా ఈ సినిమా నుండి ఏవో కారణాలు చెప్పి తెలివిగా తప్పుకున్నాడు.

    Also Read: అది మెగాస్టార్ గొప్పతనం అంటే.. !

    ఆ తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ సినిమాను తీయాలనుకున్నా బెల్లంకొండ కూడా మధ్యలోనే డ్రాప్ అయిపోయాడు. అప్పటి నుండి ఇప్పటిదాకా ఈ సినిమాకి హీరో దొరకట్లేదాయే. ఏ హీరో దగ్గరకు పోయినా దొంగ పాత్ర అని.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కాదని కాస్త ఫామ్ లో ఉన్న హీరోలు ఇంట్రస్ట్ చూపలేదు. ఇక ఒకటి రెండు హిట్స్ ఉన్న హీరోలు కూడా సినిమాలో హీరో పాత్ర పక్కా నెగిటివ్ పాత్ర అని సినిమా చేయడానికి ముందుకు రాలేదు. ఏది ఏమైనా హీరో దొరక దాదాపు నాలుగు సంవత్సరాల నుండి అప్ డేట్ లేకుండా పడి ఉన్న ఈ గజదొంగ సినిమాకి మొత్తానికి తాజాగా హీరో దొరికాడు.

    Also Read: ట్రాక్ తప్పిన హీరోయిన్.. కెరీర్ క్లోజ్ !

    టాలీవుడ్ లో రాకింగ్ స్టార్ గా ఎలివేట్ అవుదామని ఎంట్రీ ఇచ్చి.. ప్లాప్ లతో సైడ్ అయిపోయిన మంచు మనోజ్ గజదొంగ సినిమాలో హీరోగా చేయడానికి ఒప్పుకున్నాడు. మరి మనోజ్ కి ఈ గజదొంగ ఎంతవరకూ హిట్ ని ఇవ్వగలడో చూడాలి. అయితే సినిమాలో హీరో పాత్ర దొంగతనం చేసే సీన్స్ కామెడీగా ఉంటాయని.. అలాగే టైగర్ నాగేశ్వరరావు పాత్ర తాలూకు సన్నివేశాల్లో మంచి ఎనర్జీ ఉంటుందని తెలుస్తోంది. అన్నట్టు ఈ టైగర్ నాగేశ్వరరావు ఎవరో నేటి యువతకు పెద్దగా తెలియదు. ఇతను ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన స్టువర్ట్‌ పురానికి చెందిన వ్యక్తి. 1980 – 90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా నేషనల్ లెవల్లో పేరు తెచ్చుకున్నాడులేండి.