Bandi Sanjay: గ్లామర్ కోసం డ్రగ్స్.. బండి సంజయ్ సంచలన ఆరోపణల కలకలం

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి. టీఆర్ఎస్ ముఖ్య నేతలను ఉద్దేశించి బండి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అందాన్ని జట్టును కాపాడుకోవడానికి ఓ ముఖ్య నేత డ్రగ్స్ వాడుతున్నాడని.. మేం అధికారంలోకి రాగానే ముందుగా ఆయనకు రక్త పరీక్షలు చేసి బండారం బయటపెడుతామని బండి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నేతలు గ్లామర్ కోసం డ్రగ్స్ వాడుతున్నారని ఆరోపించి […]

Written By: NARESH, Updated On : September 9, 2021 9:16 am
Follow us on

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి. టీఆర్ఎస్ ముఖ్య నేతలను ఉద్దేశించి బండి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అందాన్ని జట్టును కాపాడుకోవడానికి ఓ ముఖ్య నేత డ్రగ్స్ వాడుతున్నాడని.. మేం అధికారంలోకి రాగానే ముందుగా ఆయనకు రక్త పరీక్షలు చేసి బండారం బయటపెడుతామని బండి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నేతలు గ్లామర్ కోసం డ్రగ్స్ వాడుతున్నారని ఆరోపించి బండి సంజయ్ పెనుదుమారం రేపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ నేతలకు రక్త పరీక్షలు చేయిస్తామని సంచలన ప్రకటన చేశారు.

ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా సంగారెడ్డిలో పాదయాత్రలో పాల్గొన్న బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తనను బట్టతల, గుండు అని విమర్శిస్తున్న నేత సంగతి చెబుతానని హెచ్చరించారు.

బండి సంజయ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనమయ్యాయి. ఇప్పటికే టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ సెలబ్రెటీలు అంతా నిర్ధోషులుగా తేలింది. అయినా వారిపై కేంద్రంలోని ఈడీ మ్యానీలాండరింగ్ కేసులతో విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే వారి కేసుల ఎత్తివేతను ప్రశ్నిస్తున్న బండి.. టీఆర్ఎస్ నేతలకు డ్రగ్స్ ఉందని ఆరోపించడం సంచలనమవుతోంది.

టాలీవుడ్ కు, టీఆర్ఎస్ నేతలకు దగ్గరి సంబంధాలు ఉన్నాయని బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలు చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్య నేతలు డ్రగ్స్ తీసుకుంటే రెండేళ్లు అయినా వారి రక్తంలో అవశేషాలు ఉంటాయని.. వారికి రక్తపరీక్షలు ఖచ్చితంగా చేస్తామని బండి చేస్తున్న ప్రకటనలు ఇప్పుడు సంచలనమవుతున్నాయి.

ఇటీవల టీఆర్ఎస్ ముఖ్య నేతలు బండిసంజయ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. వాటికి కౌంటర్ గానే బండి సంజయ్ ఈ ఆరోపణలు చేసినట్టుగా తెలుస్తోంది. మరి వీటికి టీఆర్ఎస్ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి.