https://oktelugu.com/

న్యూ ఇయర్ కు ఘన స్వాగతం.. ప్రపంచవ్యాప్తంగా అంబరాన్నంటిన సంబరాలు

2020 పీడ విరగడైంది. కోటి ఆశలతో కొత్త సంవత్సరం 2021కు ప్రపంచవ్యాప్తంగా సంబరంగా స్వాగతం పలికారు. గత సంవత్సరపు చేదు జ్ఞాపకాలకు వీడ్కోలు పలుకుతూ కోటి ఆశలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. Also Read: 2020కి బైబై చెప్పేసిన న్యూజిలాండ్..! ప్రపంచవ్యాప్తంగా జనం కొత్త సంవత్సరానికి ఆనందంగా స్వాగతం పలికారు. చాలా దేశాల్లో ఆంక్షల నడుమ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. తొలుత న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నగరవాసులు ఈ కొత్త సంవత్సరానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : January 1, 2021 / 09:11 AM IST
    Follow us on

    2020 పీడ విరగడైంది. కోటి ఆశలతో కొత్త సంవత్సరం 2021కు ప్రపంచవ్యాప్తంగా సంబరంగా స్వాగతం పలికారు. గత సంవత్సరపు చేదు జ్ఞాపకాలకు వీడ్కోలు పలుకుతూ కోటి ఆశలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి.

    Also Read: 2020కి బైబై చెప్పేసిన న్యూజిలాండ్..!

    ప్రపంచవ్యాప్తంగా జనం కొత్త సంవత్సరానికి ఆనందంగా స్వాగతం పలికారు. చాలా దేశాల్లో ఆంక్షల నడుమ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. తొలుత న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నగరవాసులు ఈ కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. ఆక్లాండ్ లోని క్లాక్ టవర్ లో కొన్ని నిమిషాల పాటు వెలుగు జిలుగులతో బాణాసంచా కాల్చారు.

    ఇక న్యూజిలాండ్ తోపాటు వివిధ దేశాల ప్రజలు స్వాగతించారు. ఆస్ట్రేలియాలో భారీగా కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించారు. బాణాసంచా పేల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

    ఆ తర్వాత థాయిలాండ్, తైవాన్ తోపాటు ఆగ్నేయాసియా దేశాల్లోనూ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి.

    ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో భారీగా వేడుకలు నిర్వహించారు. నగరం మొత్తం బాణాసంచా వెలుగులుతో విరాజిల్లింది.దుబాయ్ లో న్యూయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దుబాయ్ ఖలీఫా టవర్ ను విద్యుత్ వెలుగులతో వెలిగించి అబ్బురపరిచారు.

    Also Read: రైలు ప్రయాణికులకు శుభవార్త.. సులభంగా టికెట్లు బుక్ చేసుకునే ఛాన్స్..?

    దక్షిణ కొరియాలో కొత్త సంవత్సర వేడుకలు భారీగా నిర్వహించారు. కొరియన్ స్టైల్లో వేడుకలను చేసుకున్నారు. చైనా దురాక్రమణతో అట్టుడికిన చైనాలోని హాంకాంగ్ లోనూ ఘనంగా నిర్వహించారు. బాణాసంచా కాల్చి పండుగ చేశారు.

    చైనాలోనూ భారీగా నూతన సంవత్సన వేడుకలు నిర్వహించారు. బీజింగ్ లో కలర్ ఫుల్ లైట్లతో వేడుక చేశారు. ఆటలు పాటలు, విందులు, వినోదాలు, డ్యాన్సులతో అలరించారు.జపాన్,రష్యాలోనూ ఈ న్యూయర్ ఘనంగా జరిగింది.

    భారతదేశంలో కరోనా కల్లోలంతో జనాలు ఇళ్లలోనూ, ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ప్రాంతాల్లోనూ ఘనంగా వేడుకలు నిర్వహించారు. పోలీసులు ఆంక్షలతో ఈసారి రోడ్లపై కంటే ఇళ్లలోనే న్యూఇయర్ వేడకలు జరిగాయి.